నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్.. మొదలైన కారణాలతో రోడ్డు ప్రమాదలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదల కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. అలానే కొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్నాకరు వంతెనపై నుంచి 50 అడుగుల లోతులో పడిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శనివారం ఉదయం మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జయకుమార్ గోరే కారు .. తన స్వస్థలమైన సతారా జిల్లాలోని ఫాల్తాన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. పూణే-ఫండర్ పూర్ హైవేపై ఫాల్తాన్ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి 50 అడుగులు లోయలో ఎమ్మెల్యే కారు పడిపోయింది. దీంతో ఎమ్మెల్యే జయకుమార్ తో పాటు.. డ్రైవర్ సహా వాహనంలో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఎమ్మెల్యే ఛాతికి స్వల్పంగా గాయమైనట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేను హుటాహుటిన పూణేలోని ఓ ఆసుపత్రిలోకి చేర్చారు. అయితే ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మిగిలిన వారిని వేరు వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడి ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేశారు. జయకుమార్..సత్తార్ జిల్లాలోని మాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహిస్తున్నాడు. జయకుమార్ కు జరిగిన ఈ ప్రమాదంతో.. ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు గోరే చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి చేరుకున్నారు. అతివేగం కారణంగానే కారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా మన తెలుగు రాష్ట్రాల చెందిన పలువురు ప్రముఖులు సైతం మరణించారు. మరి.. ఈ రోడ్డు ప్రమాదాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.