ఇప్పటి వరకు భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ కొనసాగుతూ వచ్చారు. ఆయన పదవీ కాలం జూలై 24 తో ముగిసిపోనుంది. దీంతో నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇప్పుడు దేశ రాజధానిలో ఎన్నికకు సంబంధించిన హడావుడి మొదలైంది. అధికార పార్టీ తరుపు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేయబోతున్నారు. ఈసారి రాష్ట్రపతి అభ్యర్థినిగా ఓ గిరిజన మహిళను ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విపక్షాల తరుపు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, టీఎంసీ ఉపాధ్యక్షులు యశ్వంత్ సిన్హా ను ఎన్నుకున్నారు. ఇక ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులు, బీజేపీ నేతలతో కలిసి డ్యాన్స్ చేశారు. గిరుజనుల వేషధారణలో బాణం పట్టుకొని ఉత్సాహంగా వారితో కాలు కదిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని.. ఇది అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుందని ఆయన ట్విట్ చేశారు.
అధికార పార్టీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు మంత్రులు, నేతలు పాల్గొనబోతున్నారు. నామినేషన్లు జూన్ 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, జులై 21 లోగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక యశ్వంత్ సిన్హా జూన్ 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
आदरणीय श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति पद की उम्मीदवार बनाने पर मा. प्रधानमंत्री श्री @narendramodi जी एवं राष्ट्रीय नेतृत्व के आभार कार्यक्रम से पूर्व जनजातीय भाई-बहनों के साथ उनके अद्वितीय लोक नृत्य एवं संगीत का साथी श्री @vdsharmabjp जी के साथ आनंद लिया। pic.twitter.com/aiN9yJELvk
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 23, 2022