ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బర్త్‌డే కేక్‌ను చాక్‌తో కట్ చేస్తారు. అది కూడా ప్లాస్టిక్ చాక్‌ను కేక్ తీసుకొచ్చిన బేకరీలోనే ఇస్తారు. దానితోనే ఎవ్వరైనా కట్ చేస్తారు. ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్ చేశాడు. దాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. అడ్డంగా బుక్కయిపోయాడు. నెటిజన్లు, రాజకీయ నేతల చేతికి చిక్కాడు. కర్ణాటకలోని కొప్పల్ బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ దాడెసుగుర్ కొడుకు. అతడి పేరు సురేశ్. బర్త్ డే సందర్భంగా తన పేరులోని ఇంగ్లీష్ అక్షరాలతో కేకులను తయారు చేయించి.. తీసుకొచ్చి సురేశ్‌తో కట్ చేయించారు. బర్త్‌డే సెలబ్రేషన్లను బల్లారి జిల్లాలోని హోస్‌పేటలో నిర్వహించారు. బీఎమ్‌డబ్ల్యూ కారులో తన ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్‌డే వేడుకల్లో సురేశ్ పాల్గొన్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బర్త్‌డే కాస్త రాజకీయ రంగును అద్దుకుంది. కర్ణాటక కాంగ్రెస్ నేతలు బర్త్‌డే బాయ్ తండ్రి అయిన ఎమ్మెల్యే బసవరాజ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నెటిజన్లు కూడా ఆ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై సురేశ్ తండ్రి ఎమ్మెల్యే బసవరాజ్ స్పందిస్తూ.. ‘‘నా కొడుకు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బుతో కొన్న ఐఫోన్‌తో కేక్ కట్ చేశాడు. ఇందులో తప్పేముంది? కోవిడ్-19 వల్ల చేతులకు బదులు ఐఫోన్ ఉపయోగించాడు’’ అంటూ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘2018 ఎన్నికలకు ముందు ఎన్నికల ఖర్చుల కోసం ఆయన నియోజకవర్గంలో ప్రజలు డబ్బులు చందాలు వేసుకుని గెలిపించారు. ఆ విధంగా గెలిచిన ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?’’ అంటూ ప్రశ్నించారు.
Video: Karntaka BJP MLA’s son cutting cakes with iPhone draws flak https://t.co/0coBdXpb5o
— Soumya Chatterjee (@Csoumya21) September 3, 2021