సమాజంలో ఎంతో మంది శరీరంలో అన్ని బాగున్నా.. ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని ప్రయత్నాలు చేసి ఉద్యోగం సాధించకుంటే నిరుత్సాహ పడిపోతారు. ఇలాంటి వారిలో స్ఫూర్తి రగిల్చేలా చేశారు ఓ అవిభక్త కవలలు. బ్రదర్స్ మూవీలో లాగానే శరీరాలు అతుక్కొని పుట్టిన ఓ ఇద్దరు వ్యక్తులు తమ పనులు తామే చేసుకుంటూ, అందరిలానే ఎంజాయ్ చేస్తుంటారు.
ఎంజాయ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని వారు భావించారు. చివరికి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. శరీరాలు అతుక్కొని పుట్టిన ఇద్దరు కవలలు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. వివరాల్లోకి వెళ్తే… పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన సోనాసింగ్, మోనా సింగ్ పుట్టుకతోనే శరీరాలు అతుక్కొని పుట్టారు. అవిభక్త కవలలైన వీరికి చేతులు, తలలు వేర్వేరుగా ఉన్నా కాళ్లు మాత్రం రెండే. అలా పుట్టిన వీరిద్దరిని చూసిన వీరి తల్లిదండ్రులు మొదట్లో బాధపడ్డారు. ఆ తరువాత తమ పిల్లలు ఇతర పిల్లలకు ఏ మాత్రం తక్కువ అనే భావన రాకుండా పెంచారు.
ఈ క్రమంలోనే ఈ అవిభక్త కవలకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసి కూడా పెరిగింది. చివరికి వారు అనుకున్నట్లుగానే ఉద్యోగం సాధించారు. ఇటీవల పంజాబ్ విద్యుత్తు శాఖలో ఇద్దరు ఉద్యోగం సంపాదించారు. సమస్యలు చూసి భయపడి పారిపోయేవారికి, ఆత్మహత్యలకు పాల్పడే వారికి ఈ సింగ్ లు ఆదర్శం. క్లిష్టమైన స్థితిలో ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఈ అవిభక్త కవలలపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.