దేశంలో, రాష్ట్రంలో ఎన్నికలు జరగడం సర్వసాధారణం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి పూర్తి కాగానే ఎన్నికలు అనివార్యం అవుతాయి. ఇలా ప్రతిసారి జరిగే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ విజయం సాధిస్తుంది. అయితే ప్రతిసారీ ఎన్నికలు జరగడం మాములే అయినా.. కొన్ని ప్రత్యేక ఘటనలు కూడా చోటుచేసుకుంటూ ఉంటాయి. అలానే తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గాంధీనగర్ నార్త్ నియోజవర్గానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఓ అభ్యర్ధి వినుత్నంగా నామినేషన్ కి నగదును డిపాజిట్ చేశాడు. రూపాయి నాణేలతో రెండు సంచుల నిండా రూ10 వేలు తీసుకెళ్లి..నామినేషన్ సమయంలో చెల్లించాడు. ఇతకి ఆ వ్యక్తి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ నార్త్ నియోజకవర్గం నుంచి మహేంద్రభాయ్ పత్నీ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశాడు. అయితే నామినేషన్ డిపాజిట్ కింద రూపాయి నాణేలను కలిగిన రెండు సంచుల నిండా రూ.10 వేలు ఎన్నికల అధికారులకు సమర్పించాడు. అయితే నాణేల రూపంలో నగదు చెల్లించడంపై ఎన్నికల అధికారి.. మహేంద్రభాయ్ ను ప్రశ్నించాడు. దీంతో ఇటీవల తాము నివసించే ప్రాంతలో జరిగిన ఓ ఘటన చెప్పుకొచ్చాడు. గాంధీనగర్ సమీపంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఓ హోటల్ నిర్మాణం కోసం ఇటీవల తమ ఇళ్లను కూలగొట్టారని, దీంతో తమలాంటి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని మహేంద్ర భాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నష్టపోయిన కుటుంబాలని గాంధీనగర్ నార్త్ నియోజకవర్గం కింద ఉన్నాయని.. వారందరికి న్యాయం చేసేందుకే ఇక్కడ నుంచి పోటీ చేసేందు నామినేషన్ వేసినట్లు మహేంద్ర భాయ్ తెలిపాడు.
తనకు ఎలాంటి స్థిర, చరాస్తులు లేవని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నాడు. ఇంక దారుణం ఏమిటంటే ఇప్పటి వరకు ఆయనకు బ్యాంకు అకౌంట్ లేదంటా..నామినేషన్ కోసం అవసరమని…ఇటీవలే తప్పనిసరిగా జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ ఓపెన్ చేశారంటా. తనలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, తన మద్దతు ఇచ్చి..వాళ్ల నుంచి ఒక్కో రూపాయి సేకరించి డిపాజిట్ కింద చెల్లించానని పేర్కొన్నారు. గాంధీనగర్ నార్త్ నియోజకవర్గం నుంచి మొత్తం 28 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. రెండో విడతగా డిసెంబరు 5నపోలింగ్ జరగనుంది.