స్టార్ హీరోయిన్ అంటే విలాసవంతమైన జీవితం, పబ్బులు, ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే చుట్టూ పదిమంది సిబ్బంది.. ఇలా అందరూ ఊహించుకునేదే. కానీ, మనం చెప్పుకునే హీరోయిన్ వేరు. సమాజానికి తనవంతుగా ఏదోఒకటి చేయాలని రాజకీయాల్లోకి వచ్చింది. అయితే.. అనుకోని ఘటనతో జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలను ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వీరిద్దరికీ బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం కొన్ని గంటల వ్యవధిలో విడుదలయ్యారు. అనంతరం నవనీత్ కౌర్ అనారోగ్య సమస్యలతో బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. రవిరాణా విడుదలైన వెంటనే నేరుగా లీలావతి ఆస్పత్రికి వెళ్లి భార్యను పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రవిరాణా.. తన భార్య నవనీత్ కౌర్ రాణా అనారోగ్య సమస్యల గురించి జైలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఆరు రోజుల నుంచి నవనీత్ ఆరోగ్యం బాగోలేదని, కనీసం మహిళ అన్న కనికరం కూడా లేకుండా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వార్డులో నవనీత్‌రాణా కంటతడి పెడుతండగా.. ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Navneet Ravi Rana (@navneetravirana) May 5, 2022
ఇది కూడా చదవండి: Assam Lady SI: మరి కొద్ది నెలల్లో వివాహం.. కాబోయే భర్తను అరెస్ట్ చేసిన మహిళ!
అసలు విషయం ఏంటంటే.. మసీదులకు ఉండే మైకులను తొలగించాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన డిమాండ్ చేయడంతో వివాదానికి తెరలేచింది. మైకులను తీసేయనట్టు అయితే మసీదుల నుంచి ప్రార్థనలు వినిపించే సమయంలో.. తాము హనుమాన్ చాలీసాను మైకుల్లో ప్లే చేస్తామంటూ ఎంఎన్ఎస్ ప్రకటించింది. ఈ వివాదంలో తలదూర్చిన రవి రాణా, నవనీత్ కౌర్ దంపతులు.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా ప్లే చేస్తామంటూ ప్రకటించారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులపై దేశద్రోహ అభియోగం మోపారు. తాజాగా ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ముంబై సెషన్స్ కోర్టు.