గుజరాత్ సముద్ర తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 77 కేజీల హెరాయిన్‌ను ఏటీఎస్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. వాటి విలువు రూ.400 కోట్లు ఉండవచ్చని అంచనా. భారత సముద్ర భాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన ఫిషింగ్ బోటులో ఈ డ్రగ్స్ దొరికినట్లు అధికారులు వెల్లడించారు.
గుజరాత్ డిఫెన్స్ పిఆర్ఓ ప్రకారం.. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్‌తో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో.. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవలో హెరాయిన్‌ను తరలిస్తున్నారని గుర్తించి అధికారులు వాటిని సీజ్ చేశారు. డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం పడవను గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ తీరానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.