ఇటీవల దేశంలోని ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఇంధనంపై పన్నులు కొంత శాతం తగ్గించుకుంది ప్రభుత్వం. అయితే ఆ లోటు పాటు ని పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ రూపంలో బాదే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, రాష్ట్రాలు కలిసుండే జీఎస్టీ మండలి పలు కీలక ప్రతిపాదనలు చేసింది. చండీగఢ్ లో జరుగుతున్న 47 వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దేశంలో కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లు మార్చి మరికొన్నింటి విషయంలో మినహాయింపులను తొలగించేందుకు మండలి ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఆస్పత్రుల్లో ఉండే చికిత్స పొందే రోగులు ఐదువేల కన్నా ఎక్కువ అద్దె గది తీసుకుంటే ఐదు శాతం జీఎస్టీ పడుతుంది. ఇందులో ఐసీయూకి మాత్రం మినహాయింపు ఉంది. వ్యాపార సంస్థలకు ఉండే షాపుల సముదాయాలకు అద్దెలకు ఇస్తున్నవాటిపై కూడా పన్ను మినహాయింపు తీసివేశారు.
బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను రాష్ట్రాల మద్య రవాణా చేసుకునేందుకు ఈ-వే బిల్లు విషయంలో ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అంతేకాదు రెండు లక్షలకు మించి ఎక్కువ విలువైన బంగారు, రాళ్ల రవాణాకు ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరి. ఇక నిత్యం వాడుకునే పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు, బుక్‌పోస్ట్, ఎన్వలప్ మినహా అన్ని పోస్టల్ సేవలపైనా జీఎస్టీ వసూలు చేయనున్నారు.
అలాగే నిత్యవసర వస్తువులు ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార పదార్థాలకు పన్ను మినహాయింపు ఉండేది.. కానీ ఇప్పుడు వీటిపై ఐదుశాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించింది కౌన్సిల్. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.