నూతన సంవత్సరం కానుకగా ఆయిల్ కంపెనీలు వినయోగదారులు గుడ్ న్యూస్ అందించాయి. అయితే తాజా నిర్ణయంతో గ్యాస్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు గ్యాస్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరను క్రమంగా తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.102 తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
అయితే తాజాగా తగ్గిన ఈ గ్యాస్ సిలిండర్ ధర గృహ అవసరానికి వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రముఖ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజా ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే బయట మార్కెట్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.2 వేలకు పైగానే ఉందని తాజా తగ్గింపుతో ధరల్లో మార్పొచ్చింది. దీంతో పాటు ఈ ఏడాదిలో ఇంకా రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.