ఈ మధ్యకాలంలో అక్రమ మార్గంలో డ్రగ్స్ వంటివి దేశంలోకి ప్రవేస్తున్నాయి. అలానే బంగారం లాంటి విలువైన వాటిని కొందరు వివిధ మార్గాల్లో దేశంలోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఢిల్లీలో రూ.2 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది.
ఈ మధ్యకాలంలో అక్రమ మార్గంలో బంగారం, డ్రగ్స్ వంటివి దేశంలోకి ప్రవేస్తున్నాయి. అయితే బంగారం లాంటి విలువైన వాటిని కొందరు వివిధ మార్గాల్లో దేశంలోకి తీసుకొస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు, ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా అధికారుల, పోలీసుల కళ్లు గప్పి బంగారం వంటి విలువైన వాటిని దేశంలోకి తీసుకొస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టు లోని విమానం టాయ్ లెట్ లో దాచిన బంగారపు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వస్తున్న ఓ విమానంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నాడు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు భద్రత్తను కట్టుదిట్టం చేశారు. ఆదివారం విమానాశ్రయంలోని టర్మినల్ -2లో భారీగా తనిఖీలు చేపట్టారు.
తాజాగా ఓ విమానంలో అధికారులు తనిఖీలు చేయగా మరుగుదొడ్డిలో రూ.2 కోట్ల విలువైన బంగారం బయటపడింది. టాయ్ లెట్ లోని సింక్ కింద టేప్ తో అతికించిన ఓ పర్సును అధికారులు గుర్తించారు. అందులో దాదాపు నాలుగుల కేజీల బరువున్న నాలుగు బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలానే అక్రమ మార్గాల్లో బంగారాన్ని తరలిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టులు కూడా చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.