గత కొంత కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీస్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి స్థాపించే దిశగా పలు రాష్ట్రాల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో పార్టీ పెడతానని అన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్ లను కలిసి మాట్లాడానని తెలిపారు.
మాజీ ప్రధాని దేవేగౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా దౌవే గౌడ పలు కీలక అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని.. లౌకిక వాదం కాపాడుకునేందుకు ఆయనకు పూర్తిగా అండగా ఉంటామని అన్నారు. మీ యుద్దాన్ని కొనసాగించడండి.. సంపూర్ణ మద్దతు మా వైపు ఉంటుందని అన్నట్లు సమాచారం. త్వరలో బెంగుళూరు వచ్చి మిమ్మల్ని కలుస్తానని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
ఇది చదవండి: 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దేవేగౌడ ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఈ అంశాన్ని కొద్ది రోజుల పాటు పక్కన పెట్టారు. తాజాగా దక్షిణాది ముఖ్యమంత్రులు స్టాలిన్, కేసీఆర్ బీజేపీ వ్యతిరేక నినాదాలు చేస్తుండటంతో.. దేవేగౌడ తాజాగా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాన్ని మరోసారి తెర మీదకు తీసుకువచ్చారు. ఈ బీజేపీయేతర కూటమి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.