పోలీసులకు, నక్సలైట్లకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. ఇలా ఒకరిపై మరొకరు తరచూ దాడులు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోలీసులు తరచూ సూచిస్తుంటారు. దీంతో ఇప్పటికే ఎందరో అడవులు వదలి జననాల్లో కలిసి పోయారు
నేటికీ తరచూ ఏదో ఒక ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. ఇలా ఒకరిపై మరొకరు తరచూ దాడులు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోలీసులు తరచూ సూచిస్తుంటారు. దీంతో ఇప్పటికే ఎందరో అడవులు వదలి జననాల్లో కలిసిపోయారు. తాజాగా ఓ యువతి కూడా నక్సలిజం వదలి… ఉన్నత చదువులు చదువుతోంది. ఇటీవలే 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.
మహారాష్ట్రలోని గోందియా జిల్లా కుర్‌ఖేడా తహశీల్ గ్రామానికి చెందిన లావ్‌హరి గ్రామ గిరిజన యువతి రాజుల రావెల్సింగ్ హిదామి (19) ఈ వారం వెలువడిన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది. ఈ పరీక్షల్లో 45.83 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నేడు పరీక్షల్లో విజయం సాధించిన హిదామి ఒకప్పుడు తుపాకి చేతపట్టి అడవుల్లో తిరిగింది. నక్సలైటు మారిన హిదామి ఆ సమయంలో ఎన్నో దాడుల్లో పాల్గొంది. అయితే ఇటీవలే ఆ బాటను మార్చుకొని చదువుపై దృష్టి సారించి హిదామి ఈ ఘనత సాధించడం విశేషం. డిగ్రీ చేసి.. పోలీసుదళంలో చేరాలని ఉన్నట్లు ఆమె చెబుతోంది. 12 తరగతిలో ఉత్తీర్ణత సాధించిన హిదామీని గోందియా ఎస్పీ నిఖిల్ పింగలే సత్కరించారు.
ఈ సందర్భగా పోలీసులు హిదామి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. 2016లో తన గ్రామ సమీపంలో పశువులను మేపుతున్న హిదామీని నక్సల్స్ అపహరించారు. ఆ తరువాత బలవంతంగా కుర్‌ఖేడా గ్రూప్ లో చేర్చుకొన్నట్లు స్థానిక పోలీస్ తెలిపారు. సాయుధ శిక్షణ పొందిన హిదామి పోలీసులపై జరిగిన ఓ హింసాత్మక దాడిలో కూడా భాగస్వామి అయ్యారు. అనంతరం రెండేళ్ల తర్వాత పోలీసుల సాయంతో లొంగిపోయిన హిదామి.. అధికారుల సూచన మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేరారు. ఇలా ప్రస్తుతం 12వ తరగతి పూర్తి చేసింది. త్వరలో తాను డిగ్రీ పూర్తి చేసి.. పోలీస్ అవుతానని హిదామి తెలిపారు. మరి.. ఈ యువతి సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపాడు.