మన దేశంలో క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఉండదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం కూడా బడ్జెట్‌లో తగిన మేర కేటాయింపులు చేయదు.. పట్టించుకోదు.. కానీ పతకాలు తేవాలంటారు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత దేశంలో ఒలంపిక్స్ వంటి ప్రఖ్యాత వేదిక మీద రాణించలేకపోవడానికి ఇదే కారణం అంటారు విశ్లేషకులు. ఇక ప్రభుత్వ అధికారులు కూడా క్రీడాకారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కబడ్డీ క్రీడాకారిణులకు మరుగుదొడ్డిలో భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పుర్ జిల్లాలో ఈ సెప్టెంబర్ 16 తేదీన రాష్ట్ర స్థాయి అండర్-17 బాలికల కబడ్డీ పోటీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. స్థానిక అధికారులు ఈ టోర్మమెంట్ కు వచ్చిన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అయితే కొందరికి టాయిలెట్స్ ఉండే ప్రాంతంలో భోజనాలు ఏర్పాటు చేశారు. తమకు స్టేడియంలోని టాయిలెట్ ప్రాంతంలో భోజనాల ఏర్పాటు చేసినట్లు కొందరు జూనియర్ క్రీడకారిణీలు ఆరోపించారు. వారి ఆరోపణలు నిజం చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. టాయిలెట్ గదిలో అన్నం, కూరలు ఉన్న పాత్రలు ఉండగా.. అందులో నుంచి యువతులు అన్నం పెట్టుకున్నారు. మరొక చోట అయితే నేలపై పేపర్ వేసి పూరీలను పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఫుల్ అవుతోంది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై , స్థానిక అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్నాయి. అయితే ఈ వ్యవహారంపై సహరన్ పూర్ జిల్లా క్రీడల అధికారి అనిమేశ్ సక్సేనా స్పందించారు. భోజనాలను టాయిలెట్ ఏర్పాటు చేయలేదని, అత్యవసర పరిస్థితుల్లో వంట పాత్రలను ‘ఛేంజింగ్ రూం’లో పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. మొదట బాత్ రూంలో భోజనాలు పెట్టలేదని, స్విమ్మింగ్ ఫూల్ వద్ద ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అయితే అనుకోకుండా వర్షం పడటంతో ‘ఛేజింగ్ రూం’లోకి తీసుకెళ్లి పెట్టాం అని వెల్లడించారు. అధికారులు ఎన్ని చెప్పినప్పటికీ ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Food served to kabaddi players in #UttarPradesh kept in toilet. Is this how #BJP respects the players? Shameful! pic.twitter.com/SkxZjyQYza
— YSR (@ysathishreddy) September 20, 2022