ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఎండాకాలంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
సాధారణంగా ఏప్రిల్, మార్చి నెలలో ఎండలు దంచికొడతాయి. మొన్నామధ్య ఎండ తీవ్రత కాస్త తగ్గినట్టు అనిపించినా.. మళ్లీ సూర్యడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణంగా ఎండాకలంలో అత్యంత వేడి కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టీరీలో ఇలాంటి ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ లోని ఆరావల్లి జిల్లా లో ఓ ఫైర్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆరవళ్లి జిల్లాలో గురువారం సాయంత్రం బాణాసంచా ఫ్యాక్టీరలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారే మంటలు చెలరేగడంతో బాణా సంచా పేలుడు శబ్ధాలతో దద్దరిల్లిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. మరికొంత మంది గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించిందన్న వార్త తెలిసి ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించారు.. ఈ క్రమంలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మంటలు వ్యాపించడంతో చుట్టు పక్కల జనాలు భయంతో వణికిపోయారు. ఫ్యాక్టీరీ చుట్టు నల్లటి పొగ చుట్టుముట్టినట్లు కనిపించింది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల పలు చోట్ల ఫైర్ ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వం చెబుతున్నా కొంతమంది ఫ్యాక్టరీ యజమానుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయని అంటున్నారు అధికారులు.
#WATCH | A massive fire breaks out at a firecracker company in Aravalli district of Gujarat. Two fire tenders present at the spot. Further details awaited. pic.twitter.com/2oOnSHfpjk
— ANI (@ANI) April 20, 2023