దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రతి రోజూ ఎంతో కొంత మొత్తంలో ధరలు పెరుగుతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరి చూపు.. ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్లింది. ఇవి ఒకసారి ఛార్జ్ చేస్తే.. బ్యాటరీ కెపాసిటీని బట్టి 50 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తున్నాయి. అందువల్ల వాహన ప్రియులు అందరూ ఎలక్ట్రిక్ బైకుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి తరుణంలో తమిళనాడు, వేలూరులో జరిగిన ఒక సంఘటన ఎలక్ట్రిక్ వాహనదారులను భయపెడుతోంది. ఆ వివరాలు..
వేలూరు, చిన్న అల్లాపురంకు చెందిన.. దురై వర్మకు 13 ఏళ్ల కూతురు మోహన ప్రీతి ఉంది. ప్రీతి స్థానికంగా ఉన్న స్కూల్ లో చదువుతుండంతో.. స్కూల్ కు వెళ్ళడానికి, రావడానికి వీలుగా ఉంటుందని తండ్రిని బైక్ కొనమని అడిగింది. ఏనాడూ.. ఏమీ అడగని కూతురు బైక్ అడగడంతో ఆ తండ్రి.. మూడ్రోజుల క్రితమే తిరువణ్ణమలై జిల్లా పోలూరు సమీపంలోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షాపులో 95 వేలతో ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. కానీ, అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. కూతురి కోసం కొన్న ఆ ఎలక్ట్రిక్ బైకే వారిద్దరి ప్రాణాలు తీసింది.
ఇది కూడా చదవండి: అర్ధరాత్రి సైకిల్‌పై లేడీ ఐపీఎస్ అధికారిణి పెట్రోలింగ్.. షభాష్ అన్న సీఎం!బైకుకు ఛార్జింగ్ పెట్టి అందరూ పడుకున్నారు. ఛార్జ్ ప్రభావం బ్యాటరీపై ఎక్కువ అవ్వడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో పక్కనే పార్క్ చేసిన పెట్రోల్‌తో నడిచే మరో బైక్‌కు మంటలు అంటుకోవడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దురైవర్మతో పాటు అతని 13సంవత్సరాల కూతురు మోహన ప్రీతి మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. నిద్రపోతున్న తండ్రి, కూతుళ్లు ఎలక్ట్రిక్ బైక్ కారణంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం వేలూరు ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇవి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చాయి కాబట్టి అప్రమత్తత అవసరం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.