ఈ మద్య తరుచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.. చాలా వరకు సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని.. కొన్నిసార్లు రన్ వే పై ల్యాండ్ చేసే సమయంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల విమాన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల తరుచూ పలు చోట్ల విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.. దాంతో వందలాది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. ఆ మద్య నేపాల్ లోని పొఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది సజీవ దహనం అయ్యారు. కొన్నిసార్లు టాకాఫ్ అయిన వెంటనే ప్రమాదాలను పైలెట్లు గమనించి అత్యవసర ల్యాండింగ్ చేస్తూ వందల మంది ప్రాణాలు రక్షించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ స్పైస్ జెట్ కి భారీ ప్రమాదం తప్పింది.. ఈ ఘటన కోల్‌కతా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానం కోల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపలతి తర్వాత విమానం ఎడమ ఇంజన్ లోని బ్లేడ్ విరిగినట్లు పైలెట్లు గమనించారు. వెంటనే అలర్ట్ అయి విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆదివారం రాత్రి 1.09 నిమిషాలకు స్పైస్ జెట్ కి చెందిన బోయింగ్ 737 విమానం కోల్ కొతా నుంచి బ్యాంకాక్ కి బయలుదేరింది. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎడమవైపు ఉన్న ఇంజన్ లో బ్లేడ్లు విరిగిపోయినట్లు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. అధికారులకు సమాచారం అందించారు.
ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి రాత్రి 1.27 కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. బ్యాంకాక్ వెళ్లాల్సిన 178 మంది ప్రయాణీకులతో పాటు ఆరుగురు సిబ్బంది ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. ఇదిలా ఉంటే.. టేకాఫ్ అయిన సమయంలోనే ఇంజన్ లో బ్లేడ్లు విరిగిపోయాయని దర్యాప్తులో గ్రహించినట్లు అధికారులు తెలిపారు.