దూర ప్రయాణాలు చేసేవారు ఒకరికొకరు ఎంతో గౌరవించుకోవడం చూస్తుంటారు. కానీ ఈ మద్య విమానంలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. అంతేకాదు కర్ణాటకలో ఆర్టీసీ బస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల విమానంలో ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన కేసులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియని దారుణమైన పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు పాల్పపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటన కర్ణాటక లో ఓ ఆర్టీసీ బస్ లో జరిగింది. ఇప్పుడు ట్రైన్ లో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోవడం గమనార్హం. ట్రైన్ లో ఓ మహిళా ప్రయాణికురాలిపై టీటీఈ అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఆమెపై మూత్ర విసర్జన చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన అకల్ తక్తత్ ఎక్స్ ప్రెస్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్ లోని అమృత్ సర్ కి చెందిన ఓ మహిళ తన భర్త రాజేష్ కుమార్ తో అకల్ తక్తత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుంది. అర్థరాత్రి సమయంలో రైల్ లఖన్ పును కి సమీపిస్తున్న సమయంలో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణీకులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న టీటీఈ కాలర్ ఆమె గట్టిగా పట్టుకొని ఉన్నారు. తనపై మూత్ర విసర్జన చేసినట్లు ఆమె ఆరోపించారు. అందరూ టీటీఈ ని పట్టుకొని లఖ్‌నవూ చేరుకున్న తర్వాత అతన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడు బీహార్ కి చెందిన మున్నా కుమార్ గా పోలీసులు గుర్తించారు. మహిళ ఫిర్యాదు మేరకు టీటీఈ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అమృత్ సర్ నుంచి కోల్ కొతాకు ప్రయాణిస్తున్న అకల్ తక్తత్ ఎక్స్ ప్రెస్ ఏ 1 కోచ్ లో ఆదివారం అర్థరాత్రి పూట ఈ సంఘటన జరిగిందని జీఆర్ పీ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. నిద్రిస్తున్న ఆ మహిళపై ఎదో పడినట్టు భావించి వెంటనే నిద్ర లేచి ఆ అధికారిని గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో తనపై టీటీఈ మూత్ర విసర్జన చేసినట్లు తెలిపింది. నింధితుడు మున్నా కుమార్ గా గుర్తించామని.. అతన్ని సోమవారం లక్నో లోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ లో జీఆర్ పీకి అప్పజెప్పినట్లు అయన తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం దురృష్టకరమని ఇలాంటి నేరాలకు పాల్పపడేవారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
Drunk ticket checker ‘urinates’ on woman inside Amritsar-Kolkata #AkalTakhtExpresshttps://t.co/AHFJSwRxJy
— The Tribune (@thetribunechd) March 14, 2023