ఈ మధ్య కాలంలో రైళ్లను పలు ప్రాంతాల్లో ఆపుతున్నారు డ్రైవర్లు. వినడానికి విచిత్రంగా ఉన్నా సోషల్ మీడియాలో ఇలాంటి కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆ మద్య పెరుగు కోసం ఓ డ్రైవర్ రైలును ఆపగా.. ఇప్పుడు కచోరీ కోసం ఆపాడు. రైల్వే క్రాసింగ్ దగ్గరనే ఆపి.. ఓ వ్యక్తి ఇచ్చిన కచోరిని తీసుకున్నాడు. రాజస్థాన్… అళ్వార్ నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. ట్రైన్ డ్రైవర్ కచోరీ కోసం రైలును ఆపడం విమర్శలకు దారితీసింది.
భారతీయ రైల్వేకి సంబంధించిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్.. అళ్వార్‌లో ఓ ట్రైన్ డ్రైవర్‌కి కచోరీలు తినడం అంటే ఇష్టం. అయితే డ్యూటీ నిమిత్తం ట్రైన్ ఎక్కాడు. రైలు నడుపుతూ వెళ్తుంటే… అళ్వార్‌లోని ఓ రైల్వే క్రాసింగ్ దగ్గర ఓ వ్యక్తి కచోరీలు ఉన్న సంచిని పట్టుకొని రైలు కోసం ఎదురుచూస్తున్నాడు. రైలు నెమ్మదిగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆగింది. లోకో పైలెట్ కచోరీలు తీసుకుని, డబ్బులు ఇచ్చిన తర్వాత కదిలింది.
ఇది చదవండి: మరణాన్ని జయించిన వృదురాలు! ఎక్కడంటే?
ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వాస్తవానికి అలాంటి క్రాసింగ్‌ల దగ్గర రైలును ఆపడం నిషిద్ధం. దీంతో ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు అదేశించినట్టు సమాచారం. లోకో పైలట్, స్టేషన్ సూపరింటెండెంట్ సహా ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
@AshwiniVaishnaw @RailMinIndia @GMNWRailway @DRMJaipur @drm_dli
यह वीडियो एकwhatsappग्रुप के माध्यम से आज ओर अभी देखने को मिला हैक्या यह रेलवे नियमानुसार सही है अगर गलत है तो एक्शन लीजिए और सम्बंधित सभी व्यक्तियों पर कार्यवाही करें@vishalmrcool @JAGMALSINGH_MON @vasudhoot pic.twitter.com/Tw5dtkozzn
— NARENDRA KUMAR JAIN (@NarendraJainPcw) February 18, 2022