అధిక బరువు.. ప్రంపచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండటాన్ని ఒబేసిటీ అంటారు. ఈ ఒబేసిటీ ద్వారా మీకు లేనిపోని రోగాలు వస్తాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణం కూడా ఒబేసిటీనే. అంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం అనమాట. అయితే ఈ సమస్యను చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ, పరిస్థితి చేయిదాటిపోయిన తర్వాత చక్కదిద్దుకోవడం చాలా కష్టం.
ఇప్పుడు చెప్పుకోబోయే పోలీసు అధికారి కూడా ఈ అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడిన వారే. ఆయన ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దీర్ఘకాలిక రోగాల భారిన పడేవరకు వచ్చింది పరిస్థితి. వెంటనే తేరుకున్న ఆ పోలీసు అధికారి బరువు తగ్గించుకునేందుకు పూనుకున్నారు. మనం అందరం తీసుకునే న్యూ ఇయర్ రెజల్యూషన్ లాంటివి కాదులెండి. ఆయన మాత్రం కఠోర శ్రమ చేశారు. వెరసి 130 కిలోల బరువు నుంచి ఏకంగా 80 కిలోలకు వచ్చేశారు. ఆ పోలీసు అధికారి ఎవరు? ఆయన చేసిన కృషి ఏంటో తెలుసుకుందాం.
ఢిల్లీకి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు కథ ఇది. ఆయన పేరు జీతేంద్ర మణి. ఒక విషాదం నుంచి జితేంద్ర మణి బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నారు. జితేంద్ర మణి భార్య క్యాన్సర్ తో చనిపోయారు. ఆనకు ఇద్దురు పిల్లలు పాప ఇంటర్, బాబు పదో తరగతి చదువుతున్నారు. యాన్యువల్ హెల్త్ చెకప్ లో జితేంద్ర మణికి భయంకరమైన విషయాలు తెలిశాయి. అతని ఒంట్లో కొవ్వు, క్యాలరీస్ పెరిగిపోతున్నాయి. లివర్ కూడా ప్రమాదస్థితిలో ఉంది. వెంటనే జితేంద్ర మణి బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నారు.
అనుకున్నదే తడవుగా అన్నం, చపాతీ తినడం మానేశారు. కేవలం ఫ్రూట్స్, సూప్స్, సలాడ్లు తినడం ప్రారంభించారు. నెల తర్వాత రోజుకు 15,000 అడుగులు నడవాలని టార్గెట్ పెట్టుకున్నారు. మనిషి తలుచుకుంటే సాధించలేేనిది ఏదీ లేదని జితేంద్ర మణి నిరూపించారు. కేవలం 8 నెలల గడువులో ఆయన 130 కిలోల బరువు నుంచి 80 కేజీలకు వచ్చేశారు. ఆయన అందరికీ ఒకటే చెబుతున్నారు. అప్పుడు చేస్తా, తర్వాత చేస్తా కాదు.. ఇప్పుడు చెయ్యి అని. ఆయన బరువు తగ్గడమే కాదు.. ఎంతో మందికి మోటివేషన్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐపీఎస్ అధికారి వెయిట్ లాస్ జర్నీ వైరల్ గా మారింది.
And today we had @jitendramani1 in the studio @radiocityindia and asked him everything about @DelhiPolice pic.twitter.com/TD3TMNerCO
— ginnie (@rjginnie) December 29, 2022