ఇప్పుడు చెప్పుకోబోయే వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అలాగే పెద్దఎత్తున చర్చకు కూడా దారితీస్తోంది. దాదాపు 200 ఏళ్లనాటి పురాతన ఆలయంలోకి తొలిసారి షెడ్యూల్డ్ కులాలకు చెందిన భక్తులు ప్రవేశించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి వారికి ప్రవేశం కల్పించలేదని.. ఎన్నోసార్లు అభ్యర్థనలు చేసిన తర్వాత వారికి ఈ అవకాశం కల్పించారంటూ చెప్పుకొచ్చారు.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం అరుదైన ఘటన జరిగింది. దాదాపు 200 ఏళ్లనాటి పురాతన వరదరాజ పెరుమాళ్లు ఆలయంలోకి తొలిసారిగా దళితులు ప్రవేశించారు. కొన్నేళ్లుగా ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని అభ్యర్థనలు, నిరసనలు తెలిపినా కూడా ప్రయోజనం లేదని చెబుతున్నారు. తాజాగా తమిళనాడు హిందూ మత- ధర్మాదాాయ శాఖ నుంచి కలెక్టర్, మరో అధికారికి ఆదేశాలు అందాయి. 300 మంది పోలీసుల బందోబస్తు నడుమమ.. డబ్బు వాయిద్యాలతో షెడ్యూల్డ్ కులాలకు చెందిన భక్తులు ఆలయంలోకి ప్రవేశించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకున్నారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున గుడిలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవడంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు. కొన్నేల్లుగా తాము చేస్తున్న ప్రయత్నాలు ఇలా కార్యరూపం దాల్చాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 200 ఏళ్లనాటి పురాతన ఆలయం కాగా.. మొదటి నుంచి తమకు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదని తెలిపారు. ఊరేగింపు కార్యక్రమాల్లో కూడా తమని పాల్గొననివ్వరని వాపోయారు. తమని గుడిలోకి ప్రవేశించేందుకు, ఊరేగింపు సేవల్లో పాల్గొనేలా అవకాశం కల్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నామని తెలిపారు.
200 ஆண்டுகளாகக் கோவிலுக்குள் அனுமதிக்கப்படாத ஆதிதிராவிட மக்கள் !#GalattaNews📢 #PerumalTemple #Kallakurichi #VaradharajaPerumalTemple pic.twitter.com/5jzHMQ01NN
— Galatta Media (@galattadotcom) January 2, 2023
2008లో అయితే తమకి అవకాశం కల్పించకపోగా.. ఊరేగింపుని మధ్యలోనే ఆపేశారని చెప్పారు. జిల్లా యంత్రాంగం కృషితో తమకి దర్శనభాగ్యం కలిగిందని తెలిపారు. కలెక్టర్, అధికారులకు భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు. షెడ్యూల్డ్ కులాల వారిని గుడిలోకి ప్రవేశించకుండా అక్కడ దిక్తత్ అమలులో ఉందని తెలిపారు. తమిళనాడులో గత పదిరోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. పుదుకొట్టైలోని వెంగైవాయల్ గ్రామంలోని అయ్యనార్ ఆలయంలోకి షెడ్యూల్డ్ కులాల భక్తులకు ప్రవేశం కల్పించారు.
Dalits in Eduathavainatham village in Kallakurichi district, who have been denied entry into the Varadharaja Perumal Temple, were let inside the temple for the first time today. pic.twitter.com/bluUypSKGT
— Prabhakar Tamilarasu || பிரபாகர் தமிழரசு (@pkr_madras) January 2, 2023