అమ్మాయిలు జల్సాల కోసం మగవాళ్లను ఎర వేస్తున్నారు. మాయ మాటలతో ముంచేస్తూ.. మోసం చేయడంలో కేటుగాళ్లను మించిపోతున్నారు. ఈ మోసాలకు ప్రాణం పోస్తున్నాయి కొన్ని వివాహాలకు సంబంధించిన సైట్లు. ఇటీవల ఓ యువతి మ్యాట్రీ మోని ద్వారా నలుగుర్ని వివాహం చేసుకుని..
అమ్మో మహిళలు ముదిరిపోయారు. జల్సాల కోసం మగవాళ్లను ఎర వేస్తున్నారు. మాయ మాటలతో ముంచేస్తూ.. మోసం చేయడంలో కేటుగాళ్లను మించిపోతున్నారు. ఈ మోసాలకు ప్రాణం పోస్తున్నాయి కొన్ని వివాహాలకు సంబంధించిన సైట్లు. ఇటీవల ఓ యువతి మ్యాట్రీ మోని ద్వారా నలుగుర్ని వివాహం చేసుకుని, డబ్బులు, నగలు దోచుకెళ్లిన సంగతి విదితమే. నిజం తెలుసుకున్న నాల్గవ భర్త.. ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో భార్య పార్టీ చేసుకుంటుండగా చూసి షాక్ తిన్నాడు. చివరకు నిలదీసే సరికి చావు దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు మరో ఆంధ్రా మహిళ.. చెన్నైకి చెందిన యువకుడిని మాటలతో మభ్యపెట్టి లక్షలు కాజేసింది. పెళ్లి చేసుకుందామనే సరికి హ్యాండ్ ఇచ్చింది. మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
తమిళనాడులోని అయ్యపాక్కం కాల్ సెంటర్ లో పనిచేస్తున్నాడు అశోక్ చైతన్య అనే యువకుడు. అయితే పెళ్లి కోసం ఓ మ్యాట్రీ మోనీలో పేరు నమోదు చేసుకున్నాడు. దీని ద్వారా మదనపల్లెకు చెందిన శ్రావణ సంధ్య పరిచమైంది. ఆమె బెంగళూరులో ఉంటోంది. అయితే సంధ్య తన ఫోటోలు పంపకుండా.. అందమైన మోడల్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టి.. అతడిని మభ్యపెట్ట సాగింది. ఆమె అందానికి పడిపోయిన పోరడు.. ఆమె ప్రేమలో పడిపోయాడు. ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఇదే అదునుగా భావించిన సంధ్య.. అతడిని నుండి డబ్బులు కాజేయడం మొదలు పెట్టింది. అలా రూ. 9 లక్షల వరకు గుంజేసింది. ఇటీవల ఆమెకు ఓ విలువైన ఫోన్ కూడా కొని పార్శిల్‌లో పంపించాడు చైతన్య. ఇక మాటల ముచ్చట్లు పెరిగాయి.
ఈ క్రమంలో ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు చైతన్య. అప్పటి నుండి నో రెస్పాన్స్. మేసేజ్, ఫోన్లకు రిప్లై లేదు. చివరకు అతడి నంబర్ బ్లాక్ చేసింది. అప్పటికి కానీ తెలియలేదు చైతన్యకు తానుమోసపోయానని. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫేస్ బుక్, ఇన్ స్టా చాటింగ్ ఆధారంగా బెంగళూరులో ఉన్నట్లు గ్రహించిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేశారు. ఈ తరహాలో అనేక మందిని మోసం చేసినట్లు పోలీసులు గ్రహించారు. అమాయకపు పురుషులకు వల వేసి..పెళ్లి చేసుకుంటానని చెప్పి లక్షలు దోచుకున్న తర్వాత.. వారిని వదిలించుకునేదని తేలింది. ఆమెను కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు పోలీసులు.