కరోనా.. ఈ ఒక్కమాట మొత్తం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది.ఇక ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బకి ఇండియా అల్లాడిపోయింది. అయితే.., త్వరలోనే థర్డ్ వేవ్ కూడా దేశంపై దాడి చేయబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా పీవోఎంకు హోంశాఖ అందించిన ఓ రిపోర్ట్ ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది.
కేంద్ర హోంశాఖ నియమించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్యానెల్ దేశంలోని కరోనా పరిస్థితిలపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు నిర్వహిస్తూనే ఉంది. తాజాగా.., ఈ ప్యానెల్ ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ రిపోర్ట్ అందించింది. “భారత్ లో ఇప్పటికే ధర్డ్ వేవ్ ప్రభావం మొదలైంది. అక్టోబర్ నాటికి ఇది తీవ్ర రూపంలో దాల్చనుంది. ముందుగా అనుకున్నట్టు చిన్న పిల్లల్లే థర్డ్ వేవ్ టార్గెట్. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ నష్టం తప్పదు” అని.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్యానెల్ ఈ రిపోర్ట్ లో హెచ్చరించినట్టు తెలుస్తోంది.
నిజానికి ఫస్ట్ వేవ్ కన్నా.., సెకండ్ వేవ్ లో ఇండియా చాలా ఎక్కువ నష్టపోయింది. డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో వేలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ లో ఏ వేరియంట్ పుట్టుకుస్తుందో, ఆ వైరస్ లోడ్ ఎంత బలంగా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో ఎక్కువ అయ్యింది. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ రాక తప్పదని తేలడంతో.. పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన రిపోర్టా్ లో కూడా హోంశాఖ ప్యానెల్ ఈ విషయాన్నే ప్రముఖంగా సూచించిందట. మరి.., థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.