దేశంలో కరోనా విజృంభణ దాదాపు స్థిరంగా ఉంది. గత కొద్దిరోజులుగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ను భారత్‌లో గుర్తించడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది కేంద్రం. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అలర్ట్ చేసింది. భారత్ లో సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా నిబంధనలు కఠినతరం చేసే యోచనలో పలు రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా దేశంలో కొత్తగా 9,216 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇక దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య 9,000 కంటే తక్కువగా నమోదైంది. దేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 8,190 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,974గా ఉంది. అలాగే, నిన్న 415 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 34053856గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 4,70,530కి పెరిగింది. నిన్న దేశంలో 73,63,706 వ్యాక్సిన్ డోసులు వేశారు. దేశంలో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,26,53,44,975 వద్దకు చేరింది.
