రాజకీయ నాయకులు వారి ఉనికిని చాటుకోవడానికి, ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి ప్రజలకు పలు రకాల వాగ్థానాలు చేస్తారు. సబ్సిడీ రుణాలనో, ఉచిత కరెంటు అనో, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అని హామీలిస్తుంటారు. కానీ అక్కడ ఓ రాష్ట్రప్రభుత్వం సామూహికంగా జరిగిన వివాహాల్లో పాల్గొన్న జంటలకు వెడ్డింగ్ కిట్స్ పంపిణీ చేశారు. ఆ కిట్స్ ఓపెన్ చేసి చూడగా అందులో కనిపించిన వస్తువులను చూసి ఆశ్యర్యపోయారు.

మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్రప్రభుత్వం సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు కొత్త వెడ్డింగ్ కిట్లు ఇచ్చే విధంగా ఓ పథకాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి కన్యా వివాహం పథకాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జరిగిన సామూహిక వివాహాలల్లో పాల్గొన్న జంటలకు ఈ కిట్ లను అందజేశారు. అయితే ఆ కిట్లలో గర్భనిరోధక సాధానాలు ఉండడంతో వారు ఆశ్యర్యానికి లోనయ్యారు. మొత్తం 296 జంటలకు పెళ్లిల్లు జరిగాయి. అయితే ఆ కిట్లలో కండోమ్ లు, గర్భనిరోధక టాబ్లెట్స్ ఉండడం ఇది కాస్తా అక్కడ చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని జాబువా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దీనిపై పలువురు అధికారులు స్పందిస్తూ ఆరోగ్య శాఖ అధికారులు ఆ కిట్లో గర్బనిరోధక సాధనాలను పెట్టి ఉంటారని తెలిపారు. కుటుంబ నియంత్రణపై అవగాహన కలిగి ఉండేందుకు వాటిని అందించినట్లుగా వెల్లడించారు. ఇటీవల ఇదే స్కీమ్ లో వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఆ వధువు పెళ్లికి ముందే కాబోయే భర్తతో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. దీనిపై మెడికల్ ఆఫీసర్ స్పందిస్తూ వధువుల సాధారణ వయసు తెలుసుకునేందుకు, వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తుంటామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు.