రాజకీయ నాయకులు వారి ఉనికిని చాటుకోవడానికి, ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి ప్రజలకు పలు రకాల వాగ్థానాలు చేస్తారు. సబ్సిడీ రుణాలనో, ఉచిత కరెంటు అనో, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అని హామీలిస్తుంటారు. కానీ అక్కడ ఓ రాష్ట్రప్రభుత్వం సామూహికంగా జరిగిన వివాహాల్లో పాల్గొన్న జంటలకు వెడ్డింగ్ కిట్స్ పంపిణీ చేశారు. ఆ కిట్స్ ఓపెన్ చేసి చూడగా అందులో కనిపించిన వస్తువులను చూసి ఆశ్యర్యపోయారు.