సాధారణంగా ఎవరైన రోడ్డు ప్రమాదానికి గురైతే.. మిగిలిన వారు చూస్తూ వెళ్తారే కానీ సహయం చేయరు. కారణం ప్రమాదం జరిగిన వారికి ఏదైన జరిగితే తమ మీదకి వస్తుందేమో అనే భయం ఉంటుంది. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ సరికొత్త నాంది పలికారు. రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన వారికి వెంటనే సహయం అందేలా దీన్ని రూపొందించారు. ఇకపై ప్రమాదాల్లో బాధితులకు సహయం చేసి ఆస్పత్రిలోచేర్చిన వారికి రివార్డు ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయం సహాయం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదంలో చిక్కుకున్న వారిని అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ సమయంలో ఆసుపత్రులకు తీసుకెళ్లడంలో సాయపడిన వారికి రూ. 5వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా ప్రభుత్వం తరపున అందిస్తామని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన వారికి 48 గంటలలోపు ఉచిత వైద్యం అందించేందుకు “ఇన్నుయిర్ కాప్పోన్” పథకాన్ని CM Mk స్టాలిన్ ప్రారంభించారు.
ప్రభుత్వం గుర్తించిన 81 రకాల చికిత్సలు ఈ పథకం కింద వర్తిస్తాయి. బాధితులకు గరిష్టంగా లక్షరూపాయల వరకు చికిత్సకోసం అందిస్తారు. తమిళనాడు ప్రజలకే కాకుండా, రాష్ట్రాన్ని సందర్శించే ఇతరులకు కూడా ఈ ఉచిత వైద్య సేవలను ప్రమాదం జరిగిన 48 గంటల్లోపు అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. మరి.. సీఎం స్టాలిన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.