పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైన ఘట్టం ఇది. ఒకప్పుడైతే.. పెళ్లిళ్లు పెద్దలకి నచ్చినట్టు ఆచారాల ప్రకారం జరిగిపోయేవి. కానీ.., ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్ళిలో ప్రతి అంశం ఎలా ఉండాలో, ప్రతి ఒక్కటి ఎలా జరగాలో యువతీ యువకులు ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ పెళ్ళికి సంబంధించిన ప్రతి సంబరాన్ని తమకి నచ్చినట్టే డిజైన్ చేసుకుంటున్నారు. అయితే.. ఇలా తాము కోరుకున్నట్టు పెళ్లి జరగకపోతే మాత్రం నేటి యువత చాలా ఫీల్ అయిపోతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ పెళ్లి కూతురు తాను పెళ్లి మంటపానికి వచ్చే సమయంలో తనకి ఇష్టమైన పాటని ప్లే చేయాలని నిర్వాహుకులకి ముందుగానే చెప్పింది. అంతా తాను అనుకున్నట్టే జరుగుద్ది అనే నమ్మకంతో మంటపంలోకి సిగ్గు పడుతూ ఎంట్రీ ఇచ్చింది. అయితే.., నిర్వాహకులు మాత్రం వేరే పాటని ప్లే చేశారు. ఇంతే.., దీంతో పెళ్లి కూతురికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. పెద్దగా అరుస్తూ కోపంతో పెళ్లి క్యాన్సిల్ అనేసింది. దీంతో.. మంటపంలో ఉన్న వారంతా షాక్ కి గురయ్యారు.
బంధువులు అంతా ఆమె దగ్గరికి చేరి.., ఆ పాట తామే పాడతామన్నా పెళ్లి కూతురు ఒప్పుకోలేదు. పెళ్ళిలో సిగ్గుతో మొగ్గలేయాల్సిన పెళ్లి కూతురి మొహం.. ఈ సంఘటనతో వాడిపోయింది. అయితే.., చాలా సమయం తరువాత శాంతించిన పెళ్లి కూతురు పెళ్ళికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పాట సరిగ్గా ప్లే కానంత మాత్రాన పెళ్లి క్యాన్సిల్ అనేయాల అని నెటిజన్స్ ఈ పెళ్లి కూతురిని తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.