వారిద్దరూ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యి 9 ఏళ్ల అవుతుంది. అయితే పెళ్లైన కొత్తలో ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ రాను రాను భర్తకు.. భార్య మీద అనుమానం పెరిగింది. తరచు ఆమెని వేధించేవాడు. సూటిపోటి మాటలంటూ బాధపెట్టేవాడు. అయినా సరే ఆమె మౌనంగా భరించింది. భర్తలో అనుమానం మరింత పెరిగింది. దాంతో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. కట్ చేస్తే.. మొదటిభర్త స్నేహితుడిని సదరు మహిళ వివాహం చేసుకుంది. అది కూడా మతం మారి. పుష్పగా పేరు మార్చుకుని.. అతడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాంపుర్ జిల్లాకు చెందిన రుబీనా.. హల్ద్వానికి చెందిన షోయబ్‌ను తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. షోయబ్.. కారు డ్రైవర్‌గా పని చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో షోయబ్‌కి ప్రేమ్‌పాల్ గంగ్వార్ పరిచయమయ్యాడు. దాంతో ప్రేమ్‌పాల్ తరచూ షోయబ్ ఇంటికి వస్తుండేవాడు. అలా రుబీనాకు అతడితో పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా షోయబ్ భార్యను అనుమానిస్తుండేవాడు.
నిత్యం సూటి పోటి మాటలు అంటూ.. ఆమెని వేధించేవాడు. రుబీనా వాటన్నింటిని మౌనంగా భరిస్తూ ఉండేది. అయినా షోయబ్‌లో మాత్రం మార్పు రాలేదు.. సరికదా.. అనుమానం మరింత పెరిగింది. దాంతో వారం రోజుల క్రితం భార్య రుబీనాకు ట్రిపుల్ తలాక్ చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు పంపేశాడు. దాంతో రుబీనా ప్రేమ్ పాల్ దగ్గరకు వెళ్లింది. అతడు ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పాడు. అనుమానపు భర్తతో వేగడం కంటే.. ప్రేమపాల్‌ను పెళ్లి చేసుకోవడం మంచిది అనుకుంది.
దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బరేలీకి వెళ్లి వారిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం ‘పుష్ప’గా పేరు మార్చుకుంది రుబీనా. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.