ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం అయిన ఎంఐఎం ఛీఫ్, ఎంపీ అసదుద్దీన్‌పై కొందరు దుండగులు తుపాకులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. అసలే ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్రం సైతం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను సమీక్షించింది. అలాగే వెంటనే అమలులోకి వచ్చేలా అతనికి CRPF యొక్క Z కేటగిరీ భద్రతను అందించిందనున్నట్లు వెల్లడించింది.
ఇది చదవండి : పాతబస్తీలో హై అలెర్ట్!
ఇది వెంటనే అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ‘చిజారసీ టోల్‌ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు పంక్చర్ అయింది. వేరే కారులో వెళ్లిపోయా. అందరమూ సురక్షితంగా బయటపడ్డాం’ అని అసదుద్దీన్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
గతంలో కూడా ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.