ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్ళ దాడి చేశారంటూ ఒవైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ దాడి చేశారు. ఆదివారం సాయంత్రం కొంతమంది దుండగులు ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఇంటి లోపల ఎక్కడపడితే అక్కడ రాళ్లు ఉన్నాయి. కొంతమంది దుండగులు సాయంత్రం 5.30 సమయంలో ఇంటిపై రాళ్లు విసిరినట్టు ఆ ఇంట్లో పని చేసే వ్యక్తి అసదుద్దీన్ ఒవైసీకి సమాచారం ఇచ్చారు. ఇలా తన ఇంటిపై దాడి చేయడం నాల్గవసారి అని ఒవైసీ అన్నారు. ఇలా తన ఇంటిపై దాడి జరగడం అనేది మొదటిసారి ఏమీ కాదని, ఇది నాల్గవసారి అని అన్నారు. తన ఇంటిపై జరిగిన దాడిపై స్పందిస్తూ ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఢిల్లీలోని అశోక్ రోడ్ లో ఉన్న అసదుద్దీన్ నివాసంపై కొంతమంది దుండగులు దాడి చేశారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దాడికి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశారు. జైపూర్ నుంచి ఢిల్లీ వస్తున్నానని, రాత్రి 11.30కి ఇంటికి చేరుకున్నానని అన్నారు. ఇంటికొచ్చి చూస్తే కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయని అన్నారు. ఢిల్లీ పోలీసులు దోషులను పట్టుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ పోలీస్ టీమ్, అడిషనల్ డీసీపీ ఒవైసీ ఇంటికి చేరుకొని స్పాట్ దగ్గర సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఒవైసీ ఇంట్లో లేని సమయంలో రాళ్ళ దాడి చేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన రాజస్థాన్ వెళ్లారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ప్రచారం కోసం రాజస్థాన్ వెళ్లారు. ఆయన తిరిగి వచ్చే సరికి కొంతమంది తన ఇంటిపై రాళ్ళ దాడి చేశారు. ఒవైసీ ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అలానే సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో తమ కంటికి ఎవరూ అనుమానితులుగా కనబడలేదని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో కోతులు ఎక్కువగా తిరుగుతాయని.. కోతులు ఏమైనా రాళ్లు విసిరి ఉండవచ్చునేమో అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ళ దాడి జరగడంపై మీ అభిప్రాయం ఏమిటి? మనుషులు చేసిందా? లేక కోతులు చేసిందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
It’s concerning that this has happened in a so-called “high security” zone. I’ve submitted a complaint to the cops & they’ve reached my residence pic.twitter.com/8IO5IhqvmK
— Asaduddin Owaisi (@asadowaisi) February 19, 2023