ఎండాకాలంలో చల్లగా ఉంటుందని ఏసీ వేసుకొని పడుకుంటునారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని మరియమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో జరగగా, దంపతులు, ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఏసీ వెంట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక విచారణలో తేల్చారు. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న వెంకట్ ప్రశాంత్ (12), అతడి భార్య డి.చంద్రకళ (38), కుమారుడు అద్విక్ (6), కుమార్తె ప్రేరణ (8) మంటల్లో చిక్కుకొని మరణించారు. ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా అనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. కుటుంబానికి ఏమైనా అప్పులు ఉన్నాయా. ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ముస్లిం మహిళల్ని కిడ్నాప్ చేసి రేప్ చేస్తా! స్వామిజీ షాకింగ్ కామెంట్స్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.