కారుణ్య మరణానికి తమ కుటుంబానికి అనుమతి ఇవ్వాలంటూ ఓ వ్యక్తి చేసిన అర్జీ కలకలం రేపుతోంది. తన యజమాని తీవ్రంగా వేధిస్తున్నాడని. ఇంట్లోకి కూడా వెళ్లేందుకు వీలు లేకుండా ఇంటి చుట్టూ 15 అడుగుల గొయ్యి తీయించాడని తెలిపాడు. తన వేధింపులు తాళలేకపోతున్నాం.. మాకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ అతను వేడుకున్నాడు.
ఇదీ చదవండి: హీరో ప్రభాస్ కు సర్జరీ! షాక్ లో డార్లింగ్ ఫ్యాన్స్
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక కొడుగు జిల్లా మడికేరి పలిబెట్టలో సుబ్రమణి అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. అతను మడికేరికి చెందిన అన్నామలై అనే భూస్వామి వద్ద డ్రైవర్ గా చేస్తున్నాడు. అతనికి 250 ఎకరాల పొంటపొలాలు, తోటలు ఉన్నాయి. సుబ్రమణి ఉండేందుకు అతని భవనం కూడా ఒకటి ఇచ్చాడు. అయితే ఇటీవల వారివురి మధ్య వివాదాలు తలెత్తాయి. దాంతో సుబ్రమణిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. ఇల్లు కూడా ఖాళీ చేయాలని హెచ్చరించాడు. అయితే అన్నామలై తనకు రూ.12 లక్షలు చెల్లించాలని అవి ఇచ్చేదాకా ఇంట్లోంచి వెళ్లేది లేదని తేల్చిచెప్పాడు.
ఆగ్రహానికి గురైన అన్నామలై జేసీబీ సుబ్రమణి ఉంటున్న ఇంటి చుట్టూ 15 అడుగుల మేర గొయ్యి తవ్వించాడు. నిచ్చెన సాయంతో ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంటికి విద్యుత్, నీటి సరఫరా తొలగించాడు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుబ్రమణి కుటుంబం స్థానిక విరాజ్ పేట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నా కూడా యజమాని వేధింపులు ఆపలేదంటూ కారుణ్య మరణం కోసం రాష్ట్రపతికి అర్జీ చేసుకున్నాడు. ఈ విషయంపై సుబ్రమణి ఏం చెప్తున్నాడంటే.. ‘ఎస్టేట్ లో 25 ఏళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నా. అకారణంగా 2016లో నన్ను, నా కుమార్తెను ఉద్యోగం నుంచి తొలగించారు. కారణం అడగగా.. చెన్నైలోని తన తల్లిని కలవాలని చెప్పారు. అక్కడికి వెళ్తే బాధ్యతలన్నీ కుమారుడికే అప్పగించినట్లు ఆమె చెప్పారు. రోజూ నిచ్చెనతో ఇంట్లోకి వెళ్లాలంటే కష్టంగా ఉంది. నా భార్య ఆరోగ్యం కూడా బాలేదు’ అంటూ సుబ్రమణి వాపోతున్నాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.