చాలా మంది ఇంట్లో, ఆఫీస్ లో కాస్త ఎక్కువ పని చేస్తేనే అలసి పోయితారు. ఇక బయట నుంచి నడుచుకుంటూ వెళ్లి ఏమైన తెచ్చుకోవాలంటే అస్సలు అడుగు ముందుకు వెయ్యరు. వయస్సులో ఉన్నవారు, వయస్సు పైబడిన వారు పనులు చేసుకునేందుకు ఆపసోపాలు పడుతుంటారు. కొందరు యువతి యువకులు కాస్తా దూరం నడవగానే అలసిపోతుంటారు. ఇలాంటి వారందరూ ఓ బామ్మను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె 80 ఏళ్ల వయస్సులోనూ ఎంతో హుషారుగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరిపై ఆధారపడకుండా తనపని తానే చేసుకుంటున్నారు. అంతేకాక ఈ బామ్మ పలు రకాల పరుగు పందెలా పోటీలు సైతం పాల్గొంటుంది. ఇటీవలే ‘టాటా ముంబాయి మారథాన్’ లో ఈ బామ్మ పాల్గొన్ని అలుపు సొలుపు లేకుండా ఐదు కిలోమీటర్లు పరిగెత్తి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మారథాన్ లో ఈ బామ్మ పరుగు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర చెందిన 80 ఏళ్ల భారతీ జితేంద్ర పాథక్ అనే బామ్మ ‘టాటా ముంబయి మారథాన్’ లో పాల్గొన్నారు. స్థానిక సంప్రదాయం ప్రకారం తొమ్మిది గజాల నౌవారీ చీర, స్పోర్ట్స్ షూ ధరించిన ఈ బామ్మ.. జాతీయ జెండాను చేతపట్టి పరుగు ప్రారంభించారు. తోటి వారితో పోటీ పడుతూ ఎంతో ఉత్సాహంగా ముందుగు సాగారు. కేవలం 51.. నిమిషాల్లో సుమారు 4.2 కిలోమీటర్లు ఈ బామ్మ పరిగెత్తారు. ఎలాంటి అలుపు లేకుండా ఉత్సాహంగా ముందుకు సాగినా ఈ బామ్మ పరుగు.. ఇతర పోటీదారుల్లో స్ఫూర్తి నింపింది. 80 ఏళ్ల వయస్సులో కూడా భామ ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా ఉండటంపై అక్కడి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలా అందరితో పోటీపడి మరీ పరిగెత్తడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని బామ్మను అడిగారు.
తాను పాల్గొన్న ఐదో మారథన్ ఇదని, రోజూ ఉదయాన్నే కాసేపు నడక, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడం తనకు అలవాటని ఆమె తెలిపారు. ఆ అలవాట్లే ఈ వయసులోనూ తనను ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతున్నాయని ఆమె అన్నారు. చాలా మంది వయస్సు మీద పడే కొద్దీ అది చేయకూడదు, ఇది చేయకూడదు అని తమకు తామే కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారని, తన దృష్టిలో వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అని తన మాటలతో యువతలో స్ఫూర్తి నింపుతున్నారు ఈ బంగారు బామ్మ. ప్రస్తుతం ఈ బామ్మ మారథాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.