దేశంలో నిత్యానంద స్వామి పేరు చెప్పగానే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అంటారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. గత కొంత కాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దేశంలో నిత్యానందను విమర్శించేవాళ్లు ఉన్నారు.. దేవుడిలా కొలిచేవాళ్లూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిత్యానంద భక్తుడు ఏకంగా పద్దేనిమిది అడుగుల విగ్రహం చేయించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు లోని విల్లుపురంలో బాలసుబ్రమణ్యం అనే భక్తుడు నిత్యానంద స్వామికి ఏకంగా 18 అడుగుల విగ్రహం నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు. ఈ విగ్రహాన్ని ఐశ్వర్య నగర్ లో ఏర్పాడు చేశాడు.. దీనిపై బాతుమలై మురుగన్ అని పేరు పెట్టాడు. అంతేకాదు మలేసియాలో మురుగున్ ఆలయం లాగానే 27 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఇక్కడ విగ్రహానికి కుంభాభిషేకం నిర్వహించాడు. ఇందుకోసం వేల సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
బాలసుబ్రమణ్యం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాలకు హాజరైన శివాచార్యులు ఇది శివుడి రూపంలో ఉన్నవిగ్రహం అని.. కాలభైరవుడి విగ్రహం చేసే సమయంలో రూపం సరిగా రాకపోవడం వల్ల ఇలా జరిగిందని అన్నారు. అయితే పెద్ద ఎత్తన నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి పుదుచ్చేరి సీఎం, మంత్రుల ఆహ్వానించగా వారు రాలేదు.
ఆ మద్య నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచిన ఆయన అకస్మాత్తుగా నవంబరు 2019లో భారతదేశం నుంచి మాయమయ్యారు. మొత్తానికి నిత్యానంద విగ్రహాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.