Bore Well: దేశంలో ఇప్పటి వరకు ఎంతోమంది చిన్నారులు బోరుబావిలో పడి ప్రాణాలు విడిచారు. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన చిన్నారులు అందులో పడి నరకయాతన అనుభవిస్తూ మృత్యువాత పడుతున్నారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 80 అడుగుల లోతు బోరు బావిలో రాహుల్ అనే 11 ఏళ్ల బాలుడు పడిపోయాడు. 104 గంటల పాటు సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలుడి ప్రాణాలను కాపాడారు అధికారులు. మృత్యువుతో పోరాడి.. సజీవంగా బయటకు వచ్చిన ఈ కుర్రాడు నిజంగానే మృత్యుంజయుడు అంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లా, మల్ఖరోడా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పిహ్రిద్ గ్రామంలో.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాహుల్ సాహు అనే చెవిటీ, మూగ బాలుడు తన ఇంటి పెరట్లో ఆడుకుంటూ 80 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు, సైన్యం, పోలీసులు, స్థానిక పరిపాలనా సిబ్బందితో సహా మొత్తం 500 మంది సిబ్బంది శుక్రవారం సాయంత్రం నుంచి రిస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. 80 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో.. ఆ బాలుడు సుమారు 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు.
బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తీసి బాలుడిని రెస్క్యూ చేశారు అధికారులు. బాలుడు ఊపిరి పీల్చుకోవడానికి సహాయంగా ఆక్సిజన్ అందించారు. అయితే పూర్తిగా బండారాళ్లతో నిండిన ప్రాంతం కావడంతో సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డా.. 104 గంటలకు పైగా రెస్క్యూ చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు అధికారులు. ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ రెస్క్యూ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షించారు. రెస్క్యూ అనంతరం బాలుడిని బిలాస్ పూర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఫలించాయి. రెస్క్యూ టీమ్ యొక్క అవిశ్రాంత కృషి, అంకితభావంతో కూడిన ప్రయత్నాలతో.. రాహుల్ సాహు సురక్షితంగా బయటపడ్డారన్నారు. బాలుడిని కాపాడిన రెస్క్యూ బృందానికి థ్యాంక్స్ చెప్పారు. వీలైనంత త్వరగా ఆ బాలుడు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
मुख्यमंत्री श्री @bhupeshbaghel की सतत मॉनिटरिंग में @NDRFHQ, #एसडीआरएफ, @CG_Police, भारतीय सेना और @JanjgirDist ने संयुक्त रूप से कर्तव्यनिष्ठा का पालन करते हुए राहुल को बोरवेल से निकालने का दुष्कर कार्य कर दिखाया। यह ऑपरेशन पूरे देश के लिए मिसाल है। छत्तीसगढ़ ने इतिहास रचा है। pic.twitter.com/l5mOuXrL9b
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) June 14, 2022
ఇవి కూడా చదవండి : Madhya Pradesh: డెలివరీ యువతిని చితకబాదిన అమ్మాయిలు.. వీడియో వైరల్!