బిగ్ బాస్ హౌస్- సాదారణంగా ఎవరైనా బూతులు మాట్లాడితే వద్దని చెబుతాం. బూతులు మాట్లాడటం తప్పు, అలా మాట్లాడకూడదని హితువు పలుకుతాం. కానీ బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం బూతులు మాట్లాడటం లేదేంటీ, అలా సైలెంట్ గా ఉంటే ఎలా, నాకు నీ స్టైల్ బూతులు కావాలి అని డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు, ఎవరిని అడిగారనే కదా మీ సందేహం..
ఇంకెవరో అడిగితే అది అంత సంచలనం ఎందకు అవుతుంది చెప్పండి. ఏకంగా మన్మధుడు నాగార్జుననే అడిగారు. ఇక ఎవరిని అడిగి ఉంటారో మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది. అవును సరయునే అడిగారు నాగార్డున. సాధారనంగా తన యూట్యూబ్ ఛానల్ లో సరయు బండ బూతులు మాట్లాడుతుంది కదా. మరిప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో ఎందుకు బూతులు మాట్లాడటం లేదబ్బా అని నాగార్జునకు సందేహం వచ్చింది. అదే విషయాన్ని సరయుని అడిగేశారు.
ఎందుకు సరయు నువ్ బిగ్ బాస్ హౌజ్ లో బూతులు మాట్లాడటం లేదు అని డైరెక్ట్ గా సరయుని అడిగారు నాగార్జున. అందుకు వెంటనే.. బూతులు మాట్లాడితే మీరు తిడతారని మాట్లాడటం లేదు సర్ అని అసలు విషయం చెప్పేసింది. దీంతో.. నువ్ నీలా ఉండమ్మా అని నాగార్జున అన్నారు. మీకు ఇంకా అర్ధం కాలేదా.. హౌజ్ లో బూతులు తిట్టు అని సరయుకు ఇన్ డైరెక్ట్‌గానే హింట్ ఇచ్చారు నాగార్జున. మరి ఇక సరయు ఆగుతుందా.. తన స్టైల్లో రెచ్చిపోయింది.
సర్ మీరు బూతులు మాట్లాడమన్నారు కదా.. మరి నన్ను నీతో డేట్ కు తీసుకెళ్తేనే బూతులు మాట్లాడతా అని ఓ కండీషన్ పెట్టింది. అమ్మాయితో డేట్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి.. నీతో డేట్ కు రావాలంటే ముందు నువ్వు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు రావాలి కదా అని అడిగారు నాగార్జున. ఆయన ఒప్పుకునే సరికి ఎగిరిగంతేసినంత పని చేసిన సరయు, ఇప్పుడే కాదు సర్.. వంద రోజుల తరువాతే డేట్ కు వెళ్దాం అని చెప్పింది.
ఐతే ఓకే అన్నారు నాగార్జున. ఇంకేముంది సరయు మొహంలో సిగ్గులు ఒలికాయి. ఏదేమైనా నాగార్జున ఇలా అడిగి మరీ బూతులు మాట్లాడాలని ప్రోత్సహించడం, డేట్ కు వెళ్దామంటే ఓకే చెప్పడం మాత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. ఈ ఎపిసోడ్ అదివారం ప్రసారం అవుతుంది. చూసి ఎంజాయ్ చేసెయ్యండి.