అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆయన నివాసంలో యోగాసనాలు వేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన దేశ ప్రజలకు సందేశాన్నిచ్చారు. యోగా ఏ ఒక్క మతానికి కాదన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాన్ని పొందవచ్చని చెప్పారు. మనస్సు-శరీరాన్ని ఏకతాటిపైకి తీసుకురావచ్చొన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ mYoga App ని విడుదల చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కలిసి భారతదేశం ఈ ముఖ్యమైన స్టెప్ ని తీసుకోవడం జరిగింది. వివిధ భాషల తో యోగ ట్రైనింగ్ వీడియోలు కూడా ఈ యాప్ ద్వారా మనకి అందుబాటులో ఉంటాయి. కరోనా విపత్తు వేళ యోగా ఆశా కిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మాట్లాడుతూ యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతాయన్నారు. దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్న మోదీ దేశంలో లక్షలాదిమంది యోగ సాధకులుగా మారారని అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లినట్టు చెప్పారు. కరోనా మహమ్మారిపై ప్రతి ఒక్కరు పోరాడాల్సి ఉందని అన్నారు.
యోగాను రక్షణ కవచంగా మార్చుకోవడం ద్వారా రోగ నిరోధకశక్తి మెరుగవుతుందని, దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడడంతోపాటు శారీరక, మానసిక దృఢత్వం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు.