హైదరాబాద్- కల్వకుంట్ల తారక రామారావు.. ఇలా చెబితే కొంత మందికి అర్ధం కాదు. కేటీఆర్ అంటే మాత్రం తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్, మునిసిపల్ శాఖల మంత్రి అని ఈజీగా గుర్తుపట్టేస్తారు. కేటీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లోనే కాదు, సామాజిక అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. ప్రజలకు సంబందించి తన దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేస్తుంటారు.
ఇక కేటీఆర్ సోషల్ మీడియాలోను చాలా యాక్డీవ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. సాయంత్రం వేళ హుస్సేన్సాగర తీరంలో అస్తమిస్తున్న సూర్యుడు, అరుణ కాంతిని సంతరించుకుంటున్న ఆకాశం, బిజీ లైఫ్ లో దూసుకుపోతున్న హైదరాబాద్ ప్రజల జీవితాన్ని ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు.
ఈ వీడియోకు.. ఎవరైనా హైదరాబాద్ తో ప్రేమలో పడకుండా ఎలా ఉండగలరు.. అంటూ క్యాప్షన్ జోడించి మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. లవ్ ఎమోజీతో పాటు లవ్ హైదరాబాద్ అంటూ కేటీఆర్ బదులిచ్చారు. ఇంకేముంది కేటీఆర్ రిప్లైతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వందల రీట్వీట్లు, వేల కామెంట్లు వస్తున్నాయి.
ముందు నుంచి హైదరాబాద్ అన్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలన్నా మంత్రి కేటీఆర్కు ప్రత్యేకమైన అభిమానం. ట్యాంక్ బండ్పై సెల్ఫీ కోసం లవ్ హైదరాబాద్ హోర్డింగ్ ను ఏర్పాటు చేయించడం, ఆదివారం సాయంత్రం ట్యాంక్ పై సండ్ ఫండే కార్యక్రమాలు తీసుకురావడానికి కేటీఆర్ చాలా కృషి చేశారు.
❤️ Hyd https://t.co/W6b0vZCDqT
— KTR (@KTRTRS) December 30, 2021