హైదరాబాద్- సూపర్ స్టార్ మహేశ్ బాబుకు పుట్టిన రోజు ఈ రోజు. ఈ నేపధ్యంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షళు తెలియజేస్తున్నారు. మహేష్ బర్త్ డే సందర్బంగా తెలంగాణ ఐటీ, పరుపాలక శాఖమ మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ఎమన్నారంటే.. ఎప్పటికీ యువకుడే, నాకు తెలిసి మంచి మనసున్న సూపర్ స్టార్.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. మహేష్ బాబుకు కేటీఆర్ చెప్పిన బర్త్ డే విషెస్ ట్వీట్ ను మూడు గంటల్లోనే 15వేల మందికి పైగా లైక్ చేయడంతో పాటు 5వేలకు పైగా రీ ట్వీట్ చేశారు.
ఇక మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి బ్లాక్ బస్టర్ వీడియోను విడుదల చేశారు. దీంతో మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ వీడియో విడుదలైన 12 గంటల్లోనే 60 లక్షల వీవ్స్ తో దూసుకుపోతోంది. అన్నట్లు ఈ సినిమా వచ్చే సంక్రాతికి విడుదల అవుతోంది.
Happy birthday to the nicest superstar I know & the forever young @urstrulyMahesh 🌟
Many returns of the day brother
— KTR (@KTRTRS) August 9, 2021