ఫిల్మ్ డెస్క్- ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న తెలుగు సినిమాలన్నీ విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులోను భారీ బడ్దెట్ సినిమాలు ధియోటర్స్ లో సందడి చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి సినిమాలు ఇప్పటికే కొత్త రిలీజ్ డేట్లను ప్రకటించేశాయి.
ఇదిగో ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట టీం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఏప్రిల్ ఒకటి నుంచి మే 12కు సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మిగతా సినిమాలతో పోటీ లేకుండా ఎంచక్కా సమ్మర్ ఎండింగ్ లో సర్కారువారి పాట మూవీతో మహేష్ బాబు థియేటర్లో సందడి చేయబోతోన్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 25న విడుదల చేయబోతోన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యామ్ భీమ్లా నాయక్ చిత్రానికి రెండు డేట్లను రెడీ చేసి పెట్టుకున్నారు. ఫిబ్రవరి 25 వరకు పరిస్థితులు చక్కబడితే అప్పుడే రిలీజ్ చేస్తామని, లేదంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు.
ఇలా పెద్ద సినిమాల విడుదల తేదీలన్నీ ఫిక్స్ అయిపోయాయి. అన్నట్లు విక్టరీ వెంకటేష్ ఎఫ్ 3 సినిమా ఆచార్య కంటే ఒక్క రోజు ముందుగా అంటే ఏప్రిల్ 28న విడుదలవుతోంది. ఈ క్రమంలో మే వరకు ఏ పెద్ద సినిమాలు కూడా ఉండవు. అందుకే మహేష్ బాబు అలా ప్రశాంతంగా మే 12న సర్కారువారి పాట సినిమాను విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అందుకు సంబందించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్.
Superstar’s #SarkaruVaariPaata worldwide release on May 12 💥💥#SVPOnMay12 💕💕
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/0Vn0sSuO3H
— Mythri Movie Makers (@MythriOfficial) January 31, 2022