ఫిల్మ్ న్యూస్- తెలుగు సినీ పరిశ్రమలో ఈ జనరేషన్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాల నుంచి మొదలు సోషల్ మీడియా వరకు మహేశ్ వి అన్నీ రికార్డులే. తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేయడం ఒక్క మహేశ్ బాబుకే సాధ్యమని అభిమానులు చెబుతుంటారు. అందుకే మహేశ్ బాబుకు సంబందించిన ఏ చిన్న అంశమైనా వెంటనే వైరల్ అయిపోతుంది.
ఇక మహేశ్ బాబు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమాలు, కుటుంబానికి సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఆర్మాక్స్ అనే సంస్థ హీరోలు, హీరోయిన్లకు సోషల్ మీడియాలో వారికున్న ఫాలోయింగ్, క్రేజ్ ను బట్టి ర్యాంకులనిస్తుంది.
గత ఏడాది ఆర్మాక్స్ విడుదల చేసిన లిస్ట్‌లోనూ మహేష్ బాబు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇక ఈ యేడాది కూడా మహేష్ బాబు మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇంకేముంది మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో, కింగ్ అంటూ మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ సంవత్సరం ఆర్మాక్స్ లిస్ట్‌లో మహేష్ బాబు టాప్ లో ఉండగా, రెండవ స్థానంలో అల్లు అర్జున్, మూడవ స్థానంలో పవన్ కళ్యాణ్, నాలుగవ స్థానంలో ప్రభాస్, ఐదవ స్థానంలో ఎన్టీఆర్, ఆరవ స్థానంలో రామ్ చరణ్, ఏడవ స్థానంలో విజయ్ దేవరకొండ, ఎనిమిదవ స్థానంలో నాని, తొమ్మిదవ స్థానంలో చిరంజీవి, పదవ స్థానంలో రవితేజ ఉన్నారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే గత సంవత్సరం లాగే అక్కినేని సమంత ఈ సారి కూడా టాప్ లో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రష్మిక మందన్న, కీర్తి సురేష్, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి ఉన్నారు.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (June 2021) #OrmaxSIL pic.twitter.com/KF6bXRUxlv
— Ormax Media (@OrmaxMedia) July 14, 2021