ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన ట్రావెలర్ షెనాజ్ ట్రెజరీ కి దేశ విదేశాల్లో ఉన్న ఐస్ క్రీమ్ ల రుచులు చూడాలని కోరిక పుట్టింది. అందుకోసమే ఆమె ఈ మధ్యే దుబాయ్ కి వెళ్లి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ రుచి చూసింది. కేవలం ఆమె రుచి చూడడమే కాకుండా అక్కడి ఐస్ క్రీమ్ రకాలను అందరికీ పరిచయం చేస్తూ యూ ట్యూబ్ లో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆమె చెప్పిన ప్రకారం దుబాయ్ లోని జుమేరా రోడ్డులో ఐస్ క్రీమ్ ధర వింటే మన కళ్లు బైర్లు కమ్ముతాయి.
అక్కడ ఒక స్కూప్ ఐస్‌క్రీమ్ ధర 840 డాలర్లు (సుమారు రూ.60,000) ఖర్చవుతుంది. ఇది మనకు తెలిసిన వెనీలా ఐస్‌క్రీమ్ లాంటిది కాదు, ఎందుకంటే దీనిని వెనీలా బీన్స్ ఉపయోగించి తయారు చేస్తారు. కుంకుమ పువ్వు, బ్లాక్ ట్రఫుల్స్ మాత్రమే కాకుండా 23 క్యారెట్ల తినదగిన బంగారం ఇందులో ఉంటుంది. బ్లాక్ డైమండ్ అని పిలిచే ఈ ఐస్‌క్రీమ్ ను వెర్సేస్ గిన్నెలో అందిస్తారు.
వ్లాగర్ షెనాజ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో దాదాపు నిమిషం నిడివి గల దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్ ను ఉచితంగా ఇచ్చినట్లు తన వీడియోలో పేర్కొంది. దుబాయ్ లోని జుమేరా రోడ్ లోని ఈ కేఫ్ బంగారంతో నిండిన లాట్టీని అందిస్తుంది. ఒక కప్పు లాటే 23 క్యారెట్ల బంగారు ఆకు ఉదారమైన పొరతో పొరలుగా ఉంటుంది.
చాలా మంది దీనిపై రకరకాలుగా స్పందిస్తుంది. ఒక యూజర్ ఇక్కడ నాలుగు సార్లు రూ.60,000 ఖర్చు చేసి తిన్నట్లు పేర్కొన్నాడు. షెనాజ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక్క ఐస్ క్రీమ్ రేటుతో ఇండియాలో ఒక చిన్న కుటుంబం ఏడాది పాటు బతికేయ వచ్చు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంత రేటు ఉన్నా కూడా అక్కడ ఆ ఐస్ క్రీమ్ ను చాలా మందే తింటున్నారని షెనాజ్ పేర్కొన్నారు.