ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతోంది. ఆరు, ఏడేళ్ల పిల్లలకు కూడా జుట్టు నెరుస్తోంది. ఇక, హేయిర్ డైలు చేయక తప్పటం లేదు. అయితే, అన్ని చర్మాలకు హేయిర్ డై సెట్ కాదు. ఒక్కోసారి అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డై వేసుకునే ప్రతీసారి స్కిన్ టెస్టు చేసుకోవాలి. లేదంటే ముఖం అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన షనికా మెక్నేయిల్లా తయారువుతుంది. ఎప్పటిలాగే డై వేసుకున్న ఆమె అలెర్జీకి గురైంది. ముఖం మొత్తం వాచిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన షనికా మెక్నేయిల్ హూస్టన్‌లో టెక్ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. గత జనవరి నెలలో ఎప్పటిలాగే తన జుట్టుకు రంగు వేసుకుంది. అది కూడా తను తరచూ వాడే హెయిర్ డైనే వాడింది.
తల స్నానం చేసి, రాత్రి హాయిగా నిద్రపోయింది. పొద్దున లేచింది మొదలు తల నొప్పి తీయటం మొదలుపెట్టింది. నుదురు కూడా వాపు రాసాగింది. మరికొద్ది సేపటి తర్వాత నుదురు కాలిపోతున్నట్లు నొప్పి తీయసాగింది. ఓ గంటలోపలో ఆమె ముఖం మొత్తం వాచిపోయింది. షనికా వెంటనే డాక్టర్‌ను కలిసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ డైలో ఉండే పీపీడీ కారణంగా నాకు అలర్జీ వచ్చినట్లు డాక్టర్ తెలిపాడు. వాపు తగ్గటానికి కొన్ని మందులు కూడా రాసిచ్చాడు. మందులు వేసుకున్న తర్వాత నాకు ఎలాంటి నొప్పి కలగలేదు. డాక్టర్‌ను కలవటానికి ముందు నా ముఖం గంట గంటకు వాయసాగింది. నన్ను చూసుకుని నేనే నవ్వుకోసాగాను.
నా ముఖం చాలా ఫన్నీగా అనిపించింది. ఒక రకంగా నాముఖం ఎమోజీలాగా తయారైంది. నా కుటుంబం మొత్తం భయానికి గురైంది. నేను మొదట ఫన్నీగా భావించినా.. నొప్పి తగ్గిన తర్వాత ఫన్నీగా అనిపించలేదు. నా కళ్లు కూడా వాచాయి. కొన్ని రోజుల పాటు నేను చూడలేకపోయాను’’ అని చెప్పుకొచ్చింది. షనికా మెక్నేయిల్ ముఖంపై వాపు తగ్గటానికి దాదాపు రెండు వారాలు పట్టింది. వాపు కంట్రోల్లోకి వచ్చే వరకు ఆమె బేబీ షాంపూ వాడింది. హేయిర్ డై వేసుకునే ప్రతీసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని షనికా మెక్నేయిల్ చెబుతోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కత్తితో మేకని వధిస్తున్నాననుకుని పురుషాంగాన్ని కట్ చేసుకున్న పెద్ద మనిషి!
