ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని రక్షిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా చూస్తుంటాం. అలాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొన్ని చోట్ల ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మాకెందుకు అని చూసీ చూడకుండా వెళ్లే వాళ్లు ఉన్నారు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్షించే ప్రయత్నాలు చేయకుండా సెల్ఫీలు తీసుకొని సోషల్ మాద్యమాల్లో పెట్టి ఎన్ని లైక్స్, షేర్లు వచ్చాయని ఎదురు చూసే వాళ్లు ఎక్కువయ్యారు. కానీ.. ఓ మహిళ తమ హోటల్ కి వచ్చిన కస్టమర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో రెస్టార్ రెంట్ కి వచ్చి తింటూ ఉంటాడు. అంతలోనే ఆ వ్యక్తి గొంతులో ఏదో అడ్డుపడటంతో ఉక్కిరి బిక్కిరి అయి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అటువైపు వెయిట్రెన్ వచ్చింది. ఆమె అతని పరిస్థితి చూసి కుటుంబ సభ్యులను విషయం అడిగి తెలుసుకుంది. వెంటనే అతనికి యాంటీ చోక్ ట్రీట్ మెంట్ ప్రారంభించింది. ఈ ట్రీట్ మెంట్ వల్ల గొంతులో ఏదైనా తట్టుకుంటే కడుపులోకి వెళ్లడమే.. లేదా బయటకు రావడమో జరుగుతుంది. ఈ ట్రీట్ మెంట్ తర్వాత మనిషి ఫ్రీగా శ్వాస పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రక్రియనే హిమ్లిచ్ మనవమ్ అని అంటారు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఒక మహిళ అలా ట్రీట్ మెంట్ చేసి బతికించడం నిజంగా ఆమెకు హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మాకెందుకులే అనుకునే ఈ కాలంలో ఆ మహిళ చూపించిన తెలివి.. చేసిన ట్రీట్ మెంట్ అద్భుతం అంటున్నారు. ఆపదలో ఉన్న కస్టమర్ ని కాపాడిన మహిళ పేరు లేసీ గుప్టీల్.. ఆమె గతంలో మెడికల్ టెక్నీషియన్ గా పనిచేసిన అనుభవం ఉందట. ఈ క్రమంలోనే ఆ కస్టమర్ కి ట్రీట్ మెంట్ చేసి బతికించింది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.