ఆర్ట్ ప్రదర్శనల్లో ఉంచే పెయింటింగ్స్, కళారూపాలను చూసేందుకు ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రదర్శనలు జరిగినప్పుడు వెళ్తుంటారు. అలాంటి ఓ ప్రోగ్రామ్‌కు వెళ్లిన వృద్ధురాలు చేసిన పనికి ఓ విలువైన బొమ్మ ధ్వంసమైంది.
ఆర్ట్ వర్క్ ప్రదర్శనల గురించి వినే ఉంటారు. అద్భుతమైన పెయింటింగ్స్, కళారూపాలు, అరుదైన వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. ఆర్టిస్టుల ప్రతిభా పాటవాలను చూడాలంటే ఇలాంటి ప్రదర్శనలకు వెళ్లాల్సిందే. ఆ దేశం, ఈ దేశం అనే తేడాల్లేకుండా కళలను ఆదరించే, ఆరాధించే అన్ని చోట్ల ఇలాంటి ప్రదర్శనలు జరుగతుంటాయి. అందమైన కళారూపాలకు ఆలవాలంగా నిలిచే ఆర్ట్ ఫెయిర్లకు కనీసం ఒక్కసారైనా వెళ్లాల్సిందే. ఇక, ఆర్ట్ వర్క్ ప్రదర్శనల్లో ‘దయచేసి ఇక్కడి కళాఖండాలను తాకొద్దు’ అనే హెచ్చరిక బోర్డులను కూడా పెడుతుంటారు. అయితే కొందరు మాత్రం అలాంటివి అస్సలు పట్టించుకోరు. వాటిని ఒక్కసారైనా టచ్ చేయాలనుకుంటారు.
ఈ క్రమంలో ఒక్కోసారి వాటిని అనుకోకుండా కింద పడేయడం, దీంతో అవి పగలడం కూడా జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని మియామీలో ‘ఆర్ట్వైన్ఉడ్’ అనే ప్రదర్శనశాలలో ఇటీవల వీఐపీ ప్రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. కళాఖండాలను సేకరించే ఓ వృద్ధురాలు కూడా వీఐపీ ప్రివ్యూ ప్రోగ్రామ్‌కు వచ్చింది. ఆమె అక్కడ ప్రముఖ ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్‌కు చెందిన ‘బెలూన్ డాగ్’ సిరీస్‌లోని నీలం రంగు బొమ్మను చూసింది. ఆమె మనసులో ఏమనిపించిందో తెలియదు గానీ, ఆ బొమ్మను టచ్ చేసింది. అంతే.. ఆ గాజు బొమ్మ ఒక్కసారిగా నేల మీద పడి ముక్కలైంది.
వృద్ధురాలి వల్ల కింద పడి ముక్కలైన ఆ బొమ్మ విలువ రూ.34 లక్షలట. ఈ ఘటనపై కూన్స్ బొమ్మలను స్పాన్సర్ చేస్తున్న బెల్ ఎయిర్ ఫైన్ ఆర్ట్స్ అడ్వైజర్ మాట్లాడుతూ.. ఆ బొమ్మకు బీమా ఉండటంతో నష్ట పరిహారం లభిస్తుందని తెలిపారు. ఆ వృద్ధురాలు కావాలని దాన్ని పగలగొట్టలేదని.. అది అనుకోకుండా జరిగిన ప్రమాదమన్నారు. తాజా ఘటనలో ధ్వంసమైన ‘బెలూన్ డాగ్’ రకం వంటివి.. మొత్తం 799 మాత్రమే తయారయ్యాయి. వీటిల్లో ఇప్పుడు ఒకటి ధ్వంసం అవ్వడంతో అవి 788 మిగిలాయి. ఇక, బెలూన్ డాగ్‌ను ధ్వంసం చేసిన వృద్ధురాలి పేరును నిర్వాహకులు సీక్రెట్‌గా ఉంచారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
OH DAMN! 😱😱😱😱😱
А balloon sculpture of famous artist Jeff Koons in the shape of a dog crashed at the Art Wynwood Fair in Miami. It was valued at $42,000, the Daily Mail.
🔉
It is specified that one of the collectors decided to check whether the work by Koons really lived up… https://t.co/J8QwVtQt2K pic.twitter.com/yJXi6sWuFq— TheRealBiffBifford 🇺🇸 (@TBifford) February 19, 2023