ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. అలానే ఆస్ట్రేలియాలోనూ అలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఇప్పటికే ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నెలల క్రితం నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. మరికొద్ది సమయంలో విమానాశ్రాయనికి చేరుతుందనుకునే లోపే.. కొండలను ఢీ కొట్టి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 72 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం జరిగే కొన్ని క్షణాల ముందు విమానం లోపల జరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఈ ప్రమదానికి కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ తీరంలో రెండు హెలికాప్టర్ లో ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వ్యక్తి చిత్రీకరించిన వీడియో బయటకు వచ్చింది. వాళ్లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అప్పుడు టేకాఫ్ అయిన మరో హెలికాప్టర్.. పైకి ఎగురుతూ వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఫోన్ లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో పైలట్ యాష్ జెంకిన్సన్, బ్రిటన్ కుె చెందిన దంపతులు రాన్, డయాన్ హ్యూస్, సిడ్నీకి చెందిన వెనెస్సా టాడ్రోస్ మృతి చెందారు. అంతేకాక ఇద్దరు చిన్నారులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడుతున్నారు. వీరితో పాటు మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Australia: At least 4 killed in mid-air collision between two helicopters near Seaworld on Gold Coast.#GoldCoast #HelicopterCrash pic.twitter.com/aywIiRIGpN
— Annu Kaushik (@AnnuKaushik253) January 2, 2023
ఇక వీడియో ప్రకారం.. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న కొందరు..అక్కడి ప్రకృతి అందాలను తమ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. సముద్రంలోని అందాలను తమ ఫోన్లలో బంధీస్తూ.. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే కింద నుంచి వచ్చిన హెలికాప్టర్ వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఢీ కొట్టింది. క్యాబిన్ గ్లాస్లు పగిలిపోయి లోపల పడ్డయి. ఈ ఘటనలో వీడియోను చిత్రీకరిస్తున్న ఆ ప్రయాణికులు ఉన్న హెలికాప్టర్ ను పైలట్ సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. ఢీ కొట్టిన ఆ హెలికాప్టర్ మాత్రం రెండు ముక్కలుగా విరిగిపోయి కుప్పకూలిపోయింది. సందర్శకులతో సందడిగా ఉన్న గోల్డ్ కోస్ట్ తీరంలో ఈ ప్రమాదంతో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CONTENT WARNING: Viewers may find the following footage distressing.
Chilling vision of the fatal Gold Coast helicopter crash has emerged, showing the moments before the collision from inside the aircraft that managed to land safely. #9News
MORE: https://t.co/cTkGvy7gFz pic.twitter.com/QV7Lq1RJLM
— 9News Australia (@9NewsAUS) January 5, 2023