గత రెండు మూడేళ్ల నుంచి కరోనా మహమ్మరితో యావత్ ప్రపంచ మానవాళి చుక్కలు చూస్తోంది. ఇప్పటికే దీని కారణంగా ఎంతో మంది మరణించారు. ఇక కోవిడ్ కు అనేక రకాల వ్యాక్సిన్ లు అందుబాటులోకి రావడంతో అనేక మంది వ్యాక్సిన్ లు వేసుకోవడానికి ఉత్సహం చూపిస్తున్నారు. ఇక దీంతో పాటు ఏ వ్యాక్సిన్ తీసుకున్న కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో ఓమిక్రాన్ అనే వైరస్ వేరియంట్ వ్యాపిస్తుంది.
ఈ వైరస్ లక్షణాలున్న కేసులు కూడా నమోదవుతుండంతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ అలెర్ట్ ప్రకటిస్తూ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఓమిక్రాన్ వేరియంట్ దూసుకొస్తుండడంతో అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ సరికొత్త ప్రయోగాన్ని చేస్తుంది. పరిశోధకులు చూయింగ్ గమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తయారు చేసిన ఈ చూయింగ్ గమ్ నోట్లో వేసుకుని నమిలితే చాలు నోటిలో ఉన్న లాలాజలంలోని కరోనావైరస్ కణాల పరిమాణాన్ని తగ్గించగల సత్తా దీనికి ఉందంటూ విశ్వసిస్తున్నారు.
కరోనా సోకిన వ్యక్తులు దగ్గినా, లేదా తుమ్మినా, ఊపిరి పీల్చుకునే క్రమంలో ఈ చూయింగ్ గమ్ చాలా విధాలా సహాయపడుతుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ చూయింగ్ గమ్ టెస్ట్ ట్యూబ్‌లలో పరీక్షింస్తుండడంతో త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇక విజృంభింస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ ను ఈ చూయింగ్ గమ్ పూర్తిగా అరికడుతుందని యూనివర్సిటీ పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ నిజంగానే కరోనా తీవ్రతను ఈ చూయింగ్ గమ్ అడ్డకట్ట వేస్తుందో లేదో చూడాలి మరి.