టొలుండ్ మ్యాన్ మమ్మీ దొరికి ఇప్పటికి 70 సంవత్సరాలు పైనే అవుతోంది. ఇప్పటివరకు చాలా మంది ఆ మమ్మీపై పరిశోధనలు జరిగిపారు. తాజా, పరిశోధనల్లో అతడు చనిపోవటానికి ముందు ఏం తిన్నాడో కనుగొన్నారు. అతడి కడుపులో..
టొలుండ్ మ్యాన్.. ఇతడి గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు. టొలుండ్ మ్యాన్ అనేది ఓ పురాతన మగ మమ్మీ. 1950లో డెన్మార్క్‌లోని జుట్‌లాండ్ పెనిన్‌సులాలో దీన్ని వెలికి తీశారు. ఈ మమ్మీని ఓ కుక్క శవంలాగా భద్రపరిచారు. దాదాపు 70 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు దీనిపై పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టొలుండ్ మ్యాన్‌పై పరిశోధనలు చేసిన నిపుణులు ఎన్నో విషయాలను కనుగొన్నారు. అతడు చనిపోయి 2400 ఏళ్లు అవుతున్నా శరీరం ఇంకా చెక్కుచెదరకుండా ఉండటంతో పరిశోధనలు చేయటం సులభంగా మారింది. ఈ మమ్మీ దొరికిన కొత్తలో దీన్ని ఓ హత్యకు గురికాబడ్డ వ్యక్తిగా చాలా మంది భావించారు. అయితే, అతడిది హత్య కాదని, సాధారణ మరణమని తర్వాత తేలింది.
అంతేకాదు! చనిపోవటానికి ముందు టొలుండ్ మ్యాన్ ఏం తిన్నాడో కూడా కనుగొన్నారు. కొన్నేళ్ల క్రితం ఆ టొలుండ్ మ్యాన్‌పై జరిపిన పరిశోధనల్లో అతడి అంతర్గత భాగాలు అద్భుతంగా భద్రపర్చబడి ఉన్నట్లు గుర్తించారు. శాస్త్ర సాంకేతికత బాగా అభివృద్ది చెందిన తరుణంలో రెండేళ్ల క్రితం అతడి కడుపులోని పదార్ధాలపై పరిశోధన చేశారు. 2021లో దీనిపై కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ‘‘ టొలండ్ మ్యాన్ లాస్ట్ మీల్’ పేరిట ఓ ఆర్టికల్ ప్రచురించింది. అందులో శవం పెద్ద పేగులోని పదార్ధాల వివరాలను వెల్లడించింది. అతడు చనిపోవటానికి 12-24 గంటల ముందు చేపల్ని తిన్నట్లు తెలిపింది. పేగుల్లోని ప్రొటీన్, క్రిముల గుడ్ల ద్వారా కడుపులో పారసైట్ ఏర్పడినట్లు వెల్లడించింది.
ఇప్పటికీ అతడి పేగుల్లో పెర్సికేరియా విత్తనాలు ఉన్నట్లు తెలిపింది. ఇక, టొలుండ్ మ్యాన్ చనిపోవటానికి అసలైన కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. ప్రస్తుతం డెన్మార్క్‌లోని సిల్కెబోర్గ్ మ్యూజియంలో టొలుండ్ మ్యాన్ మమ్మీని ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 1987లో కేవలం అతడి తలను మాత్రమే గుర్తించారట. ఆస్తి పంజర నిర్మాణాన్ని బట్టి మిగిలిన భాగాన్ని తయారు చేసినట్లు సమాచారం. మరి, 2400 ఏళ్ల క్రితం చనిపోయిన టొలుండ్ మ్యాన్ మమ్మీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.