సాధారణంగా ప్రతీ దేశానికి వారి వారి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను ప్రభుత్వాలు తీసుకొస్తాయి. కాలం మారుతున్న కొద్ది ఆచారాలు.. అలవాట్లు మారుతాయి. అయితే పాత చట్టాలు కొన్ని నేటి ఆధునిక కాలంలో పాతబడటమో లేక దేశ ప్రజలు దాన్ని వ్యతిరేకించడమో చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఒక దేశం స్వలింగ సంపర్కం నేరం కాదు అంటూ ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సమాజంలో స్వలింగ సంపర్కులపై ఉన్న వివక్షతను తొలగించేందుకు సింగపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటీస్ కాలం నాటి స్వలింగ సంపర్కాన్నినిషేధించే చట్టం 377A ను రద్దు చేస్తున్నట్లు ప్రధాని లీ హీల్స్ లూంగ్ ప్రకటించారు. దీంతో స్వలింగ సంపర్కం ఇక నుంచి నేరం కాదు అని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వలింగ సంపర్క సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే వివాహా వ్యవస్థలో స్త్రీ, పురుషుల మధ్య జరిగే చట్టపరమైన నిర్వచనాన్ని మార్చే ఉద్దేశం లేదని ప్రధాని లూంగ్ స్పష్టం చేశారు.
సింగపూర్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ఏ చట్టం ప్రకారం ఇద్దరు పురుషుల మధ్య సంపర్కం నేరం. అయితే ఈ నిర్ణయం చాలా లేట్ గా ప్రభుత్వం తీసుకుందని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. సమానత్వం వైపు నడిచేందుకు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అంటూ స్వలింగ సంపర్క సంఘాలు ప్రశంసించాయి. మరి సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
PM Lee: Even as we repeal s377A, we will uphold & safeguard the institution of marriage. Under the law, only marriages between 1 man & 1 woman are recognised in SG. Many national policies rely upon this definition. The Govt has no intention of changing this.#NDR2022 #NDRsg
— leehsienloong (@leehsienloong) August 21, 2022