ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది.. అద్దె కట్టే పనిలేకుండా పదహారేళ్లు ఒంటరిగా గుహలో జీవనం సాగించాడు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఇంటి అద్దె కోసం ఖర్చు చేయడం ఇష్టం లేక గుహలోకి వెళ్లాడు. ఇక ఆయన జీవనశైలి గురించి వింటే ఆశ్చర్యపోక మానరు.
ప్రతి ఒక్కరు మంచి ఇళ్లు, ఉద్యోగం, కారు వంటి ఉండాలని కోరుకుంటారు. అందుకు తగినట్లు కష్టపడి కృషి చేసి.. కొందరు తమ కలలను సాకారం చేసుకుంటారు. అయితే ఇలా కష్టపడి సాధించిన ఆస్తులను, ఉద్యోగాలను వదలి కొందరు ఒంటరి జీవనం చేస్తుంటారు. కుటుంబ బంధాలను, ఆస్తులను వదిలేసి.. అందరికి దూరంలో అడవుల్లో, గుహల్లో ఒంటరి జీవనం సాగిస్తుంటారు. ఏ రోజుకు ఆరోజు ఆహారాన్ని సేకరించి.. వేరే ఆలోచనలు లేకుండా గడుపుతుంటారు. ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే డేనియల్ షెల్లాబార్జర్. అందరిలానే మంచి ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించిన ఆ వ్యక్తి.. కొన్ని సంఘటనలతో జీవితంపై వైరాగ్యం ఏర్పడింది. మరి.. ఆయన పూర్తి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాకు చెందిన డేనియల్ షెల్లాబార్జర్ అలియాస్ స్వీలో అందరిలాగే సాధారణ జీవితం గడిపేవాడు. ఓ ఉద్యోగంలో చేరి మంచి జీతాన్ని అర్జిస్తున్నాడు. అలానే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో నివాసం ఉంటున్నాడు. అయితే కష్టపడి సంపాదించడం.. అలా వచ్చిన డబ్బులను ఎక్కువ భాగం ఇంటి అద్దెగా కట్టడం స్వీలోకు నచ్చలేదు. చాలా సార్లు ఇష్టం లేకున్న అద్దె చెల్లిస్తూ వచ్చాడు. చివరకి ఓ రోజు భయకరమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. అద్దె ఇల్లు వదిలి సమీపంలో ఉండే గుహలోకి వెళ్లాలని అతడు నిశ్చయించుకొన్నాడు.
ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో అతడి వద్ద కొంత డబ్బు ఉంది. దానిని సమీపంలోని ఓ పబ్లిక్ టెలిఫోన్ బాక్సుపై పెట్టి.. తిరిగి వచ్చేశాడు. అయితే అలా డబ్బులు అక్కడ పెట్టిన సమయంలో విలువైనవి పోగొట్టుకున్నట్లు కాకుండా, ఓ గుదిబండను వదిలించుకున్నట్లుగా తన మనసు హాయిగా ఉందంట. చివరకు యూటా రాష్ట్రంలోని మోఅబ్ పట్టణం సమీపంలోని ఓ గుహలోకి వెళ్లిపోయాడు. ఆకలి వేసినప్పుడు చెత్తడబ్బాలను వెతికి దొరికిన ఆహారాన్ని తెచ్చుకుని గుహలో తినేవాడు. మాంసం తినాలనిపిస్తే.. రోడ్లపై చనిపోయిన జంతువులను తెచ్చుకుని వండుకుని తినేవాడు.
గుహకు సమీపంలోనే కూరగాయలను పెంచుకుని.. వాటినే ఆహారంగా తినే వాడు. ఇలా విచిత్రమైన ఆహారశైలి ఉన్న కూడా తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని స్వీల్లో అంటున్నాడు. అప్పుడప్పుడు గ్రంథాలయానికి వెళ్లి.. కంప్యూటర్లను వినియోగించి బ్లాగ్ రాసేవాడు. ఇంకా తన గుహ జీవితం గురించి డేనియలా అనేక విషయాలు తెలిపారు. “గతంలో కొన్ని సార్లు గుహలో ఉండటం అలవాటు చేసుకున్నాను. కష్టపడి సంపాదించిన డబ్బులను ఖర్చు చేయడం నాకు నచ్చలేదు. అందుకే ప్రకృతి వైపు అడుగులు వేశాను. చాలావరకు ఆదిమానవుల జీవనశైలిని అనుసరిస్తూ కాలం గడిపాను” అని ఆయన తెలిపాడు.
ఆధునిక జీవన విధానం చూసి తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, అందుకే గుహలో నివసించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దాదాపు పదహారేళ్లు గుహలో ఒంటరి జీవితం గడిపిన ఆయన.. తన తల్లిదండ్రులు బగా వృద్ధులు కావడంతో వారికి సేవ చేసేందుకు మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చాడు. ఇలా పదహారేళ్లు గుహలో ఓ వ్యక్తి ఒంటరిగా జీవించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.